ఆంధ్రప్రదేశ్‌

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రకేయులతో మాట్లాడుతూ రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిందని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికే ఎన్డీఎ నుండి బయటకు వచ్చానని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేతులు ఎలా కలిపారని ప్రశ్నించారు. తాజా సంఘటనలతో టీడీపీ తగిలించుకున్న ముసుగు తొలగిపోయినట్టయిందని అన్నారు.
చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధిలో పూర్తిగా విఫలం చెందారని, తమ స్వార్థానికి తెలుగు ప్రజల పరువు తీస్తున్నారని అన్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్చు చేసిన నిధులపై కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వ్యక్తులు నడిపిస్తున్నారా లేకా వ్యవస్థ నడిపిస్తోందా అర్ధం కాని పరిస్థితిలో ఉందని అన్నారు.