ఆంధ్రప్రదేశ్‌

జగన్ అడ్డు తొలగించుకోవడమే బాబు అజెండా: తమ్మినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజ్‌సర్కిల్), ఆగస్టు 10: రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణతో ప్రజలకు చేరువవుతున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ప్రతిష్ఠను చూసి తట్టుకోలేక కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న చంద్రబాబు ఏడేళ్ల తరువాత ఈడీ కేసులో ఛార్జ్‌షీట్‌లో జగన్ సతీమణి భారతి పేరు చేర్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా జగన్‌ను అడ్డు తొలిగించుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు. ఈడీ కేసులో నిందితురాలిగా భారతి పేరు ఛార్జ్‌షీట్‌లో ఉందని పలు పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన భారతికే సమాచారం లేనిది కొన్ని మీడియాలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈడీలో ఉన్న అధికారులతో టీడీపీ నేతలు కలిసి దర్యాప్తు సంస్థల్లో రాజకీయ ఏజెంట్లుగా పని చేస్తున్నారన్నారు. దీనిపై గతంలో ప్రధానికి, రాష్టప్రతికి జగన్ ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈడీలో ఉన్న ప్రస్తుత అధికారుల్లో కొందరు టీడీపీ నేత దేవేందర్ గౌడ్ బంధువులుగా తెలిపారు. అవినీతి జరగక పోయినా జరిగినట్లుగా చూపించే ప్రయత్నం గత ఏడేళ్లగా జరుగుతోందన్నారు. కేసు దర్యాప్తు గత ఏడేళ్ళుగా జరుగుతుంటే ఇప్పుడు భారతి పేరును తెరపైకి తీసుకు వచ్చి బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయంగా జగన్‌ను అడ్డుతొలగించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఇది సాధ్యం కాదన్నారు. వైఎస్ కుటుంబంలోని మహిళపై కూడా కేసులు పెట్టడానికి వెనకాడటం లేదంటే ఎక్కడకు వెళ్తున్నానరో, ఏం చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు అవినీతి, ఓటుకు నోటు కేసుకు సంబంధించి సమన్లు జారీ అయినప్పటికీ ఇప్పటి వరకు విచారణ జరగలేదన్నారు. వ్యవస్థలను చంద్రబాబు ఏ విధంగా మేనేజ్ చేస్తారనేదానికి ఈ కేసులే ఉదాహరణగా తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లు కూడా మాకు బాబు శాశ్వతమిత్రుడని చెప్పిన తీరు దీనికి అద్దం పడుతుందన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్‌తోనూ చంద్రబాబు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు. దీని కారణంగానే చంద్రబాబు కుంభకోణాలు అంటూ బీజేపీ నేతలు కేవలం ప్రెస్‌మీట్లకే పరిమితం అవుతూ కాలం గడుపుతున్నట్లు గుర్తు చేశారు.