ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణకు అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఆగస్ట్10: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణకు సౌత్ వెస్ట్ ఏషియన్ ఫుట్‌బాల్ సమాఖ్య జనరల్ అసెంబ్లీలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ డెలిగేట్‌గా హాజరయ్యే అరుదైన గౌరవం లభించింది. జెడ్డా(సౌదీ అరేబియా)లో ఈనెల 12న జరిగే ఈ సమావేశంలో భారత ఫుట్‌బాల్ సమాఖ్య తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నూతన కార్యవర్గం ఎన్నికల్లో ఓటు హక్కును కూడా వినియోగించే అవకాశాన్ని సమాఖ్య కల్పించడం గోపాలకృష్ణ సేవలకు గుర్తింపు లబించినట్లయ్యింది. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు 20 దేశాల ఫుట్‌బాల్ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ మేరకు జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య కార్యదర్శి కుషాల్ దాస్ ఈ-మెయిల్ ద్వారా గోపాలకృష్ణకు సందేశాన్ని పంపారు. గోపాలకృష్ణ శనివారం ఢిల్లీ నుండి మిగతా ఇద్దరు డెలిగేట్స్‌తో పాటు జెడ్డాకు బయలుదేరనున్నారు.