ఆంధ్రప్రదేశ్‌

నూతన ప్రత్యామ్నాయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఇటువంటి తరుణంలో ప్రజలకు నూతన ప్రత్యామ్నాయం కావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఏఏపీ పార్టీలన్నింటితో కలసి పోరాటం చేస్తున్నామన్నారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఉత్తరాంధ్ర సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన నాలుగేళ్లలో రాష్ట్ర అప్పు రూ.94 వేల కోట్ల నుంచి రూ.2.49 లక్షల కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు చేసిందేమి లేదన్నారు. అమరావతిలో రాజధానికి ఇప్పటికే 34 వేల ఎకరాలు సేకరించారని, మరో 14వేల ఎకరాలు కావాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారన్నారు. దీనిని తాము అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండానే ఒకటో తారీఖు వచ్చేసరికి జీతాలు తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కొత్తవలసలో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి ప్లాట్లను అమ్ముకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మదు విమర్శించారు. జిల్లాలో 5 జ్యూట్ పరిశ్రమలు, 8 ఫెర్రో అల్లారుూస్ పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వచ్చే నెల 15న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, ఎం.కృష్ణమూర్తి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, జనసేన ప్రతినిధి త్యాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పక్కన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తదితరులు