ఆంధ్రప్రదేశ్‌

వ్యక్తిగతం కాదు.. వెసులుబాటు ఖాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతా అనేది వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన, పూర్తిగా ఆర్థిక శాఖ నిర్వహించే వెసులుబాటు కలిగిన ఖాతా అని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర వివరణ ఇచ్చారు. సచివాలయంలో ఆయన శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీడీ ఖాతాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. పీడీ ఖాతాలను ఆయా సంస్థల పేరుతో మాత్రమే నిర్వహిస్తారని, వ్యక్తిగతంగా నిర్వహించరని స్పష్టం చేశారు. సంస్థతో పాటు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఖాతా అని తెలిపారు.
ఇది లోపభూయిష్ట నిర్వహణ కాదని, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణగా స్పష్టం చేశారు. ఈ ఖాతాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉండదని, వడ్డీ భారం తగ్గుతుందన్నారు. ఏదైనా ఒక పనికి కేటాయించిన సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తే, 3 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తారని, అదే మొత్తాన్ని అప్పుగా బ్యాంక్ నుంచి తీసుకుంటే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. పీడీ ఖాతా నుంచి సర్దుబాటు చేసుకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉండదన్నారు. ఈ ఖాతా నుంచి కోటి రూపాయలు దాటిన ప్రతి చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అన్నారు. సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ప్రవేశపెట్టాక, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చిందన్నారు. పీడీ ఖాతాల నిర్వహణ, వడ్డీ ఖర్చు తగ్గించుకునే విధానాన్ని కాగ్‌కు వివరించామన్నారు. వారు అర్థం చేసుకున్నారని వివరించారు. బిల్లులు చెల్లించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించామన్నారు. దేశంలో ఇంత సమగ్రంగా నిర్వహించే రాష్ట్రం ఏపీ మాత్రమేన్నారు.
ఖాతాల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉండవచ్చన్నారు. మన రాష్ట్రంలో 13 వేల పంచాయతీలు ఉన్నాయని, ఆ మేరకు 13 వేల పీడీ ఖాతాలు ఉంటాయన్నారు. పంచాయతీలు, స్థానిక సంస్థల నిధులు, ఆర్థిక సంఘం, రాష్ట్ర గ్రాంట్లు కలిసి పోకుండా ఒక్కో గ్రామ పంచాయతీకి మూడు ఖాతాలు కేటాయిస్తారన్నారు. 1వ ఖాతాలో సొంత నిధులు, 2వ ఖాతాలో ఆర్థిక సంఘం నిధులు, 3వ ఖతాలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఉంటాయన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో 72,652 ఖాతాలు నిర్వహించేవారమని, విభజన తరువాత ఏపీకి 43,384, తెలంగాణకు 29,236 ఖాతాలు వచ్చాయన్నారు. ఏజీ నివేదిక ప్రకారం మార్చి 2018 నాటికి ఏపీకి 57,455 ఖాతాల్లో 29,909 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.
నిధులు లేకపోవడంతో 12,822 ఖాతాలను తొలగించామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీడీ ఖాతాల సంఖ్య 44,663కు తగ్గిందన్నారు. వాటిలో పంచాయతీలకు సంబంధించినవి 25,836 అని, అర్బన్ లోకల్ బాడీస్‌కు సంబంధించినవి 348, సివిల్ కోర్టులకు సంబంధించిని 610, విద్యా సంస్థలవి 800, చీఫ్ ప్లానింగ్ అధికారి ఖాతాలు 800 ఉన్నట్లు వివరించారు. పీడీ ఖాతాల్లో పారదర్శకత కోసం పీడీ ఖాతా పోర్టల్‌ను 2014లో రూపొందించామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 4272 ఖాతాలు ఉన్నాయని, అనేక రాష్ట్రాలు ఏపీ విధానానే్న అమలు చేస్తున్నాయన్నారు. ట్రెజరీల్లో కాకుండా బ్యాంకుల్లో జమచేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని, అన్ని పథకాలకు వేర్వేరుగా బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందన్నారు. కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే, ట్రెజరీల్లో నిధులు ఉంచుతున్నామన్నారు. మిగిలిన లావాదేవీల తరహాలోనే ట్రెజరీ పీడీ ఖాతాలను నిర్వహిస్తున్నామన్నారు.
చిత్రం..పీడీ ఖాతాల గురించి వివరిస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర