ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణానికి విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాజధాని నిర్మాణం కోసం శుక్రవారం ఉండవల్లిలోని నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పలువురు విరాళాలను అందచేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ అధ్యక్షుడు కోటేశ్వరరావు 30.25 లక్షల రూపాయలను విరాళంగా అందచేశారు. సీఎం కష్టాన్ని చూసి, ఆ సంస్థ ఉద్యోగులు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులను, వయో వృద్ధుల సంస్థ ఉద్యోగులను అభినందించారు. ఉదారతతో విరాళాలు ఇచ్చిన వీరిని చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి సీఎం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. 114 మంది ఉద్యోగులు జూన్ నెల 15 రోజుల వేతనాన్ని విరాళంగా అందచేశారు. ప్రవాసాంధ్రులు కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్ సీఎంను కలిసి 5 లక్షల రూపాయలను విరాళంగా అందచేశారు. తెనాలికి చెందిన తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఈ విరాళం ఇస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఆటోడ్రైవర్ విరాళం
రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక ఆటోడ్రైవర్ శుక్రవారం విరాళం అందచేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి ఆటోడ్రైవర్ పి.సురేష్ బాబు 1.28 లక్షల రూపాయలను విరాళంగా అందచేశారు. రాష్ట్భ్రావృద్ధికి సీఎం పడుతున్న తపన చూసి స్ఫూర్తి పొంది విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఆటో నడుపుకుంటూ పొదుపు చేసి విరాళాన్ని ఇచ్చానని తెలిపారు. రాజధాని నిర్మాణం పట్ల సురేష్ తన భాగస్వామ్యాన్ని, సేవా తత్పరతను చాటుకున్నాంటూ సీఎం అభినందించారు.