ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతి నిలయం వేదికగా జాతీయ న్యాయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఆగస్టు 10: జాతీయ న్యాయ సదస్సుకు అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సంసిద్ధమైంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. శనివారం మధ్యాహ్నం విలువలలో న్యాయానుసార ప్రపంచం సదస్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ప్రారంభిస్తారు. స్వతంత్య్ర భారతావని చరిత్రలో ఒకే వేదికపై అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, సుమారు 40 మంది వివిధ రాష్ట్రాల అత్యున్నత న్యాయమూర్తులు, 780 మంది న్యాయ నిపుణులు, ప్రతినిధులు సమావేశం కానున్నారు. న్యాయ వ్యవస్థలో విలువలను పాటించేందుకు సత్సంకల్పంతో చేపట్టనున్న ఈ జాతీయ సదస్సు చరిత్రలో నిలిచిపోనుంది. శనివారం మధ్యాహ్నం ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. న్యాయవాద వృత్తిలో నైతిక విలువల ప్రాధాన్యతపై న్యాయనిపుణులు, న్యాయమూర్తులతో చర్చాగోష్టి నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎన్‌వి రమణ, ఎస్‌సీ, ఎల్‌టీఏ ఛైర్మన్ జస్టిస్ ముఖోపాధ్యాయ, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హల్వేర్ భండారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఛీప్ జస్టిస్ రాధాక్రిష్ణన్, కర్నాటక, కేరళ, అలహాబాద్, అస్సోం, జబల్‌పూర్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 40 మంది న్యాయమూర్తులు, న్యాయ కార్యదర్శులు, లా ట్రిబ్యునల్ ఛైర్మన్లు, యూనివర్శిటీల వీసీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా కోర్టు జడ్జిలు, సుమారు 780 మంది ప్రతినిధులు ఈ మహత్తరమైన న్యాయ సదస్సులో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న సదస్సులో న్యాయవృత్తిలో విలువలు అన్న అంశాన్ని సుదీర్ఘంగా చర్చించి దేశానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాక్రిష్ణన్, పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, అధికారులు పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సదస్సు నేపధ్యంలో ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభామందిరం, పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.