ఆంధ్రప్రదేశ్‌

స్వాతంత్య్ర యోధుల స్ఫూర్తితో కేంద్రంపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఆగస్టు 12: నాటి స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై ఉద్యమిస్తున్నట్లు, అమరవీరుల త్యాగాలే మార్గదర్శకాలుగా ముందుకు సాగనున్నట్లు రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన ఏడుగురు అమరవీరుల స్మృతిచిహ్నంగా రణరంగ్ చౌక్‌లో నిర్మించిన స్థూపాల వద్ద మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. తొలుత గాంధీచౌక్‌లో మహాత్మునితో పాటు పలువురు జాతినేతల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం స్ఫూర్తిదివస్ పేరుతో భారీ ర్యాలీగా రణరంగ్ చౌక్‌కు చేరుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఘనత తెనాలి ప్రాంత వాసులకు దక్కడం గర్వకారణమన్నారు. నేడు పెడదారులు పడుతున్న యువతను సరిదిద్ది వారిలో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టేందుకు గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలా మోసగిస్తూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువతరం కోసం రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరోమారు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాచైతన్యంతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యవౌతుందని, ఆ బాటలోనే తెలుగుదేశం ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు.
తెనాలిలో రెండుమార్లు వేడుకలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ దేశంలో ఒకమారు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగితే తెనాలిలో రెండు మార్లు జరుగుతాయన్నారు. ఇందులో ఆగస్టు 12న తెనాలిలో నిర్వహించే స్ఫూర్తి దివస్ ఒకటిగా కాగా, 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలు మరొకటని చెప్పారు. కుల, మతతత్వాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు దేశంలో పోయేంతవరకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70సంవత్సరాలు దాటినా ఇప్పటికీ చిన్నారులు, బాలికలు, మహిళలపై దాడులు, అరాచకాలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపులు జరగటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు.
అసమానతలు పోవాలి
దేశంలో అసమానతలు లేని స్వాతంత్య్ర సాధనే నేడు ప్రతిఒక్కరి ధ్యేయం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. శాంతి మార్గమే గాంధేయ వాదమని, నాడు దేశంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఏడుగురు స్వాతంత్య్ర సమరయోధులు మృతి చెందిన ఘటన తెనాలిలో జరగటం ఇక్కడి పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. నాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి యువతరానికి నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తున్న ఆనందబాబు, రాజకుమారి