ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ ఆదాకు ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా పథకాల అమలుకు వచ్చే ఐదేళ్ల పాటు సాలీనా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించేందుకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) అంగీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విశాఖపట్నంలో విద్యుత్ ఆదాపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు విజయవంతమైందన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొన్నాయని, విద్యుత్ ఆదాపై ఆధునిక టెక్నాలజీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఇంధన సదస్సును వచ్చే ఏడాది తిరుపతిలో నిర్వహించాలని కేంద్రం ఆదేశించినట్లు చెప్పారు.