ఆంధ్రప్రదేశ్‌

సీఎంకు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, తదితరులు ఉండవల్లి గ్రీవెన్స్‌హాలులో సోమవారం గజమాలతో సత్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్బడిన తర్వాత నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా పేద బ్రాహ్మణులకు చేయూతనందించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటంతో పాటు ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. సంస్థ ఆవిర్భావం రోజున బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆనందసూర్య ముఖ్యమంత్రికి వివరించారు. బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో భాగంగా కర్నూలు, కడప, మదనపల్లి, మచిలీపట్నం, కాకినాడతో పాటు రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కటౌట్లకు పాలాభిషేకం నిర్వహించడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై వేమూరి ఆనందసూర్య, కార్పొరేటర్ మహేష్, డైరెక్టర్ కాజ వెంకట శివరామ సుబ్బారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కటౌట్లకు పాలాభిషేకం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదలచేసిన రూ 285 కోట్లను బ్రాహ్మణ యువతకు విదేశీ విద్య, స్వావలంబన, వృద్ధులకు పింఛన్ల కోసం ఖర్చు చేసినట్లు ఆనందసూర్య తెలిపారు.