ఆంధ్రప్రదేశ్‌

హెల్త్‌వర్శిటీ ముట్టడికి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మెడికల్ కౌనె్సలింగ్‌లో రిజర్వేషన్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేవరకు కౌనె్సలింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలనే డిమాండ్‌పై ఏపీ విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు సోమవారం తలపెట్టిన ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీ ముట్టడి కార్యక్రమాన్ని సాయుధ పోలీస్ బలగాలు భగ్నం చేశాయి. పెద్దసంఖ్యలో విద్యార్థులు, యువకులు తరలిరాగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోనే అటకాయించారు. ఈ సందర్భంగా వాగ్వివాదం... తోపులాటలు జరిగాయి. దాదాపు 40మందిని అరెస్ట్ చేసి పెనమలూరు ఇతర పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల 496మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారన్నారు. గతంలో అమల్లోనున్న జీవో 550 ప్రకారం కౌనె్సలింగ్ జరపాలని, తొలివిడత కౌనె్సలింగ్‌ను రద్దుచేసి తరగతులు జరుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయమంటే అరెస్ట్ చేస్తారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లుతెరచి రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులకు తగు న్యాయం చేయాలని, ఇందుకోసం తక్షణమే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి జీవో 550ను సవరణ చేయాలని, సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌తో వాదనలు వినిపించి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి సీపీఐ అండగా నిలుస్తుందని రామకృష్ణ అన్నారు. ఇలాఉంటే కౌనె్సలింగ్ పూర్తిగా నిలిచేవరకు తమ పోరాటం రోజురోజుకు మరింత ఉద్ధృతం చేస్తామని అరెస్టయిన నాయకులు తెలిపారు.

చిత్రం..విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి జీపులో తరలిస్తున్న పోలీసులు