ఆంధ్రప్రదేశ్‌

ఒక పైపునుంచే నీరు విడుదల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 7: గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానించడానికి కీలకమైన పోలవరం కుడి కాలువ సామర్ధ్యంపై సందేహాలు నెలకొనడంతో నీటి తరలింపును అధికారులు నియంత్రించారు. గోదావరిపై పట్టిసంవద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రెండు మోటార్లు ఆన్‌చేసి డెలివరీ పాయింట్‌కు చేరుకునే సమయానికి ఇంజనీరింగ్ అధికారులు మిగిలిన 22 మోటార్లను ఆన్‌చేశారు. 12 పైపుల ద్వారా కుడి కాలువలోకి వెళ్తున్న గోదావరి నీటిని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వెళ్లిన మరుక్షణమే ఇంజనీరింగ్ అధికార్లు మొత్తం మోటార్లు నిలిపివేశారు. అనంతరం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాలుగు మోటార్లు ఆన్‌చేసి రెండు పైపుల ద్వారా నీటిని విడుదలచేశారు. గురువారం ఉదయం 10 గంటల సమయానికి నాలుగు మోటార్లు ఆనైవుండగా, మధ్యాహ్నానికి వాటిని రెండు మోటార్లకు తగ్గించారు. ఒక పైపు ద్వారా మాత్రమే కుడి కాలువలోకి గోదావరి నీటిని వదులుతున్నారు. కుడికాలువ నిర్మాణం పూర్తికాని కారణంగా తక్కువ నీటిని విడుదల చేసి, ఎంత నీరు వెళ్లేందుకు అవకాశం ఉందో పరిశీలిస్తున్నామని అధికార్లు తెలిపారు. పరిశీలన అనంతరం పరిస్థితికి అనుగుణంగా మోటార్లను ఆన్‌చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లు దాటితేనేగాని ఎత్తిపోతల బావుల్లోకి నీరువచ్చి, మోటార్ల ద్వారా నీరు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం సిడబ్ల్యుసి అధికారుల లెక్కల ప్రకారం గోదావరి నీటిమట్టం 16 మీటర్లు ఉంది.