ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 8:మచిలీపట్నంలో పోర్ట్ కారిడార్ అభివృద్ధికోసం భారీయెత్తున భూ సమీకరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేఖరులకు వివరించారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలను సమీకరించిన ప్రభుత్వం మళ్లీ భారీ భూ సమీకరణకు రంగం సిద్ధం చేసింది. మచిలీపట్నం ఏరియా డవలప్‌మెంట్ అథారిటీ, పోర్టు కారిడార్ అభివృద్ధికి 426 చదరపు కిలోమీటర్ల పరిధిలో 22 వేల ఎకరాలను సమీకరించాలని శుక్రవారం జరిగిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 29 గ్రామాల పరిధిలో ఈ భూమిని సమీకరించాలని నిర్ణయించింది. క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) చట్ట ప్రకారం రాజధానిలోని భూమిని సమీకరించారు. మచిలీపట్నంలో ఇదే చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ అథారిటీకి భూములు ఇచ్చిన వారికి రాజధాని ప్రాంతంలో మాదిరి నివాస, వ్యాపార స్థలాలను కేటాయించనున్నారు. 2017 జూలై ఏడవ తేదీ నాటికి ఈ భూ సమీకరణను పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే రాష్టవ్య్రాప్తంగా పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15,745 వేలమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంచారు. 6,700 రూపాయల కనిష్ట వేతనాన్ని 12 వేలకు పెంచారు. 11,500 రూపాయల గరిష్ఠ వేతనాన్ని 17,500 రూపాయలకు పెంచారు.పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 నాటికి పూర్తి చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇందుకు అవసరమైన 20 వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి రాబట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతినెలా క్యాబినెట్ సమావేశంలో పోలవరం పనులను సమీక్షించడంతోపాటు నెలకోసారి ముఖ్యమంత్రి బృందం ప్రత్యక్షంగా సమీక్షించాలని నిర్ణయించారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఇంజనీర్లను క్యాబినెట్ అభినందించింది. ఇందులో కీలకపాత్ర పోషించిన ఇంజనీర్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలను సేకరించి, ఎంఎస్‌ఎంఇఐలకు కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే 117 నియోజకవర్గాల్లో 18,340 ఎకరాలను గుర్తించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరితగతిన భూ సేకరణ జరపాలని నిర్ణయించారు. వీటి వలన రాష్ట్రం మొత్తంమీద 1,75,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఐఐఐటిల్లో కోర్సులు ప్రారంభం
ఒంగోలు ఐఐఐటిలోకి సంబంధించి ఆర్‌కె వ్యాలీలో, శ్రీకాకుళం ఐఐఐటికి సంబంధించి నూజివీడు ఐఐఐటిలో ఈ సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును అనుసరించి, అమరావతిలో విట్, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాలతోపాటు, విజయనగరంలోని సెంచూరియన్, భీమవరంలోని ఫిషరీస్ అండ్ ఓషన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది.
దేశంలోనే తొలిసారిగా ఇన్నోవేటివ్ సొసైటీలు
దేశంలోనే తొలిసారిగా ఇన్నోవేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.ప్రతి జిల్లాలోని కళాశాలలు, స్కూళ్లలో ఈ సొసైటీలను ఏర్పాటు చేస్తారు. వీటిలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ పాలసీలను ప్రారంభిస్తారు. డివైసెస్, బయోమెట్రిక్, డ్రోన్ తదితర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఐటి నిపుణులతో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తారు. వ్యవసాయం, విద్య, ఇరిగేషన్ తదితర రంగాల్లో కొత్త విధానాలను కనుగొని, వాటిని రాష్ట్ర స్థాయిలో ఉన్న ఇన్నోవేషన్ సొసైటీకి పంపిస్తారని, వాటిని పూర్తిగా అధ్యయనం చేసి, అమల్లోకి తీసుకువస్తారు.
రాష్ట్రంలోని వివిధ శాఖలలు, కార్పొరేషన్లలో ఉద్యోగాల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేడ్-2 లాంగ్వేజ్ పండిట్‌లను, జెడ్‌పిలో పనిచేస్తున్న పిఇటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
స్థానికతపై నిర్ణయం
వచ్చే ఏడాది జూన్ రెండో తేదీలోగా తెలంగాణ నుంచి ఎపికి వచ్చిన ఉద్యోగులను ఎపిలోని స్థానికులుగా గుర్తిస్తారు. వారికి సంబంధించినవారు తెలంగాణలో ఉంటే, వారిని స్థానికులుగా గుర్తించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు