ఆంధ్రప్రదేశ్‌

రూ. 8 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 9: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి కోసం 8వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్ర తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ పాలక వర్గ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో తాగునీరు నివారణ కోసం 850కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. నాబార్డ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని నిర్ణయించామన్నారు. ఉపాధిహామీ పథకం సహకారంతో ప్రతి పంచాయతీలో సిసి రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 4500కిలోమీటర్లు సిమెంటు రోడ్డు నిర్మించామని, మరో 3వేల కిలోమీటర్లు సిసి రోడ్డు నిర్మాణం చేయనున్నామన్నారు. పంచాయతీ కార్యాలయాలకు భవనాలు లేని చోట 15లక్షలతో భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అంగన్‌వాడి భవనాలకు కూడా 10లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.