ఆంధ్రప్రదేశ్‌

‘ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లను టైమ్ స్కేల్ పద్ధతిలో క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ (ఈయూ) నాయకులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా డబుల్ డ్యూటీలు చేసే వారికి డబుల్ వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 60 సంవత్సరాల వయోపరిమితిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, క్లరికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎం హనుమంతరావులు శనివారం సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్‌గా గుర్తింపులోకి వచ్చిన వెంటనే ఐక్య కూటమిగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పర్చేందుకు కృషి చేస్తామని, అందులో భాగంగానే కొన్ని వినతి పత్రాలను యాజమాన్యానికి ఇచ్చామని, యాజమాన్యంతో జరిగే సంయుక్త సమావేశంలో వీటన్నింటిపై చర్చించనున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలలు కరువుభత్యం బకాయిలపై సానుకూలంగా స్పందించారన్నారు.