ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీపై రూ. 210 కోట్ల డీజిల్ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన ఆర్టీసీపై 210 కోట్ల రూపాయల మేర భారం పడిందని సంస్థ చైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు. శనివారం గుంటూరు ఎన్‌టీఆర్ బస్టాండ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పల్నాడు సెక్టార్ మినీబస్టాండ్‌ను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు ప్రారంభించారు. రామయ్య మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో రూ. 437 కోట్లు నష్టాన్ని నివారించుకోగలిగామని, 2017-18 సంవత్సరంలో 703 కోట్ల నష్టాన్ని కార్మికులు తగ్గించినప్పటికీ ప్రధాని మోదీ పేల్చిన డీజిల్ బాంబుతో ఆర్టీసీపై అదనపు భారం పడిందన్నారు. ప్రజలపై భారాలు మోపకుండా నష్టాన్ని భరిస్తూ ప్రజలకు సేవాభావంతోనే ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు. ఆర్టీసీలో కార్గో సర్వీసులను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపజేసి 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించి ప్రాణాలు కోల్పోవద్దని, సురక్షితమైన, సుఖవంతమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపాలని కోరారు. రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యాధునికమైన ఏసీ బస్సులను కూడా ప్రవేశ పెడుతున్నామన్నారు. అనంతరం గుంటూరు - హైదరాబాద్ గరుడ ఏసీ బస్సును ప్రారంభించారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య