ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీ వైద్యులకు రెట్టింపు జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 9: ఏజెన్సీల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్లకు రెట్టింపు జీతాలు (డబుల్ శాలరీ) చెల్లించనున్నట్టు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాన్ని విశాఖలో శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో రక్త నిల్వ కేంద్రాలతో పాటు మినీ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు వీలుగా ఏజెన్సీలో స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను వినియోగించుకునే యోచనలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఆపరేషన్ థియేటర్లలో గైనకాలజిస్ట్, ఎనన్తీషియన్, పీడియాట్రీషియన్‌లను నియమించి, వీరికి డబుల్ శాలరీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి 2000 వేలకు పెంచుతున్నామని తెలిపారు.
ప్రసవానికి నాలుగు రోజుల ముందుగానే వీరిని ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య సేవలతో పాటు భోజన సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ పథకం నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఆమె పేర్కొన్నారు. గర్భిణులకు ప్రతి నెలా 9న వైద్య పరీక్షలు, అవసరమైన సేవలు అందించనున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బోధనాసుపత్రులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. మెటర్నిటీ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచే ప్రతిపాదన ఉందన్నారు.

చిత్రం.. బాలింతను పరామర్శిస్తున్న ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య