ఆంధ్రప్రదేశ్‌

చైనాలో మంత్రి లోకేష్ బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంఫియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా వెళ్లిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ సోమవారం బిజీబిజీగా గడిపారు. బీజింగ్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాగా, కొన్ని కంపెనీలతో అంగీకార ఒప్పందాలను చేసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన తన చైనా పర్యటనను వినియోగించుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు వివరించి, ఏపీలో పెట్టుబడుల పట్ల సానుకూలత వచ్చేలా చేస్తున్నారు. బీజింగ్‌లో మందుగా హెచ్‌సిటిజి కంపెనీలో ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్జ్రంలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా త్వరితగతిన కంపెనీలు ఏర్పాటయ్యేలా సహకరిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రాయితీలు, త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఏపీ కల్పిస్తున్న రాయితీలు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధులు తాము ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్‌లో 2100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా ఏపీలో కంపెనీ ఏర్పాటుకు అంగీకార ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో పెట్టుబడి ప్రణాళికతో వస్తామని వారు తెలిపారు. అనంతరం సోలార్ ఎనర్జీ పరికరాల తయారీలో ప్రఖ్యాతి గాంచిన చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూపు సీఈవో వాన్గ్ బిన్ తదితరులతో సమావేశమయ్యారు. ఏపీలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, గడచిన నాలుగేళ్లలో 6.8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని మంత్రి వివరించారు. మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరిస్తామని, మరిన్ని కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. కంపెనీ విస్తరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నామని, మరిన్ని కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు సహకరిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. రైసన్ సోలార్ టెక్నాలజీ ఆపరేషన్స్ డైరెక్టర్ జియాన్సింగ్ జెంగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలు మంత్రి వివరించాక, ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలో పూర్తి స్థాయి ప్రణాళికలతో ముందుకు వస్తామని తెలిపారు. సన్నీ ఆప్టికల్స్ టెక్నాలజీ వైస్ డైరెక్టర్ ఆరాన్‌తో కూడా మంత్రి సమావేశమయ్యారు. ప్లాస్టిక్స్, పీసీబీ, చిప్ డిజైన్, ఈ-వేస్ట్ మానేజ్‌మెంట్ కూడా ఏపీలో జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆరాన్ తెలిపారు. దేశంలో తయారయ్యే 30శాతం మొబైల్‌ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయని, కంపెనీలకు అవసరమైన నిపుణులైన యువత ఎపీలో ఉన్నారని మంత్రి తెలిపారు. ఏపీల్లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లను సందర్శించాలని ఆహ్వానించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఆరాన్ తెలిపారు. అనంతరం షామీ సప్లైయర్స్ ఇనె్వస్టుమెంట్ సమ్మిట్‌లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలో ఇప్పటి వరకూ ఏర్పాటైన కంపెనీలకు విద్యుత్, నీరు వంటి వౌలిక సదుపాయాల సమస్య లేదన్నారు. ఫ్యాక్స్‌కాన్ కంపెనీలో 14 వేల మంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేస్తున్నారన్నారు.
నాలుగేళ్లలో దేశంలోకి ఆటోమొబైల్ రంగంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 80 శాతం ఏపీకి వచ్చాయన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లసర్లను ఏర్పాటు చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపు, వౌలిక వసతులు కల్పించిన అద్దె భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారని కోరారు. ఈ పర్యటనలో ఐటి కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు.