ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీలకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 9: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన గౌరవవేతనాన్ని సోమవారం నుంచి అమలుచేస్తామని రాష్ట్ర గనులు, స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా నాలుగువేల 357మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు ఈమేరకు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రభుత్వంపై ఏటా 420 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. లోటుబడ్జెట్‌లో కొనసాగుతున్నా సంక్షేమ పథకాలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్నా ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటం బాధ్యతగా భావించి ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 257 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55667 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని, 48,770 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 6,837మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 48,770 మంది అయాలు పనిచేస్తున్నారని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తకు ప్రస్తుతం ఇస్తున్న 4,200 రూపాయల గౌరవవేతనాన్ని ఏడువేల రూపాయలకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు 2,950 రూపాయల నుంచి 4,500 రూపాయలకు, ఆయాలకు 2,200 రూపాయల నుంచి 4500 రూపాయలకు గౌరవవేతనాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఏడువేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే అయిదువేల భవనాల నిర్మాణానికి సంబంధించి అనుమతులు లభించాయని తెలిపారు. అన్నీ అంగన్‌వాడీ భవనాల్లో లైట్లు, ఫ్యాన్లు, సురక్షితమైన సాగునీటి వసతి దశలవారీగా కల్పిస్తామని చెప్పారు. ఈ కేంద్రాలను మినీ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అమలుచేస్తునట్లు మంత్రి సుజాత తెలిపారు.

చిత్రం.. మంత్రి పీతల సుజాత