ఆంధ్రప్రదేశ్‌

పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై బాబు అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: కాకినాడ పెట్రోలియం సెజ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీని వేదిక చేసుకుని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల విడుదల, కేటాయింపులపై వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాకినాడ పెట్రోలియం సెజ్‌కు వయబులిటీ గ్యాప్ కింద ఏడాదికి రూ. 1200 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు హెచ్‌పీసీఎల్‌కు చెల్లించాలని, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్‌ఆర్) 14 శాతం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారన్నారు. రాజస్థాన్‌కు 10 లేదా 12 శాతం ఐఆర్‌ఆర్‌కు ఇచ్చారని చంద్రబాబు అన్నారన్నారు. అయితే ఇది వాస్తవం కాదన్నారు. రాజస్థాన్‌కు ఇచ్చిన తరహాలోనే ఐఆర్‌ఆర్ కాకినాడ సెజ్‌కు రావాలంటే ఏడాదికి రూ. 984 కోట్లు ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ కింద ఇవ్వాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారన్నారు.