ఆంధ్రప్రదేశ్‌

28న రాష్ట్రంలో మందుల దుకాణాల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, సెప్టెంబర్ 18: ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాల అనుమతికి నిరసనగా ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్సు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నెల 28న మందుల దుకాణాలు మూతపడనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం జరిగిన సీమాంధ్ర డ్రగ్గిస్టు అండ్ కెమిస్ట్సు అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆన్‌లైన్ మందుల విక్రయాల కారణంగా తలెత్తే దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేసింది. డాక్టర్ రాసిన మందుల చీటి (ప్రిస్క్రిప్షన్) లేకుండా మందులు ఆన్‌లైన్లో అమ్మటం చట్ట వ్యతిరేకమని సమావేశం పేర్కొంది. యువతకు కీడుచేసే ఎంపిటి కిట్స్, సిల్లెనాఫిల్, తడలాఫిల్, కొడైన వంటి మత్తుకల్గించే మందులు ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఆన్‌లైన్లో విరివిగా దొరికితే ఏర్పడే దుష్ఫలితాలను అంచనావేయలేమని అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ఆన్‌లైన్లో మందుల కోసం ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు జారీచేసి అమ్మకాలుచేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్‌కు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత డ్రగ్ యాక్ట్ 1940, 1945 ప్రకారమే నడస్తుందని అధికార్లు ప్రతి షాపును ఆరు మాసాలకోసారి చెక్ చేయాలన్న నిబంధనను ఆన్‌లైన్ల వ్యాపారానికి రెండు సంవత్సరాలు కొకసారిగా ఉంటుందని ప్రకటించారని, రూరల్ ఏరియాలో నెట్ సౌకర్యంలేని ప్రాంతాలకు మందులు సకాలంలో అందవని చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కెమిస్టులు వారి వద్ద పనిచసే 80 లక్ష కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి పనిచేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెపి రంగారావు, కోశాధికారి టి నరేష్‌బాబు, పాలకొల్లు శాఖ అధ్యక్షుడు కలిదిండి సూర్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు చలపతి, ప.గో.జిల్లా శాఖ కార్యదర్శి ప్రసాద్, నాయకులు నాగు, సత్యనారాయణ, మాఘం బాలకొండలరావు అబ్బులు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ తయారుజేసిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.