ఆంధ్రప్రదేశ్‌

సమావేశ అజెండా అంశాలు ముందుగా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 18: అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలకు సంబంధించిన అజెండాలను ముందుగానే సభ్యులకు అందించాలని పలువురు శాసనసభ్యులు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకువచ్చారు. చర్చకు వచ్చిన సందర్భంలోనే అజెండా కాపీలు ఇవ్వడంతో వాటిని అవగాహన చేసుకోవడం, దానిపై మాట్లాడటం కొంత ఇబ్బందిగా ఉందని, ఒకరోజు ముందుగానే అందిస్తే అవగాహన చేసుకునేందుకు సులువుగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభా వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం పలుశాఖలకు చెందిన బిల్లులు సభ ముందుకు వచ్చాయి. వీటిపై జరిగిన చర్చలో భాగంగా ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సభ ముందుకు వచ్చిన పలు బిల్లులపై కనీసం మంత్రులకు కూడా అవగాహన ఉండటం లేదన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కనీసం ఒక్కరోజు ముందుగానైనా అజెండా అంశాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ముఖ్యమైన బిల్లులు సభలో ప్రవేశపెడుతున్న సమయంలో అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ బిల్లులను ముందుగా సభ్యుల అమోదంతోనే ప్రవేశపెడుతున్నామని, అందరూ మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నిబంధనలను పాటిస్తూ, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
అసెంబ్లీ ముందుకు 11 బిల్లులు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు శాఖలకు చెందిన సవరణ బిల్లులు సభ ముందుకు వచ్చాయి. ఏపీ చట్టాలు, వినిమయాలు(రద్దు) -2018 బిల్లును న్యాయ, క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిపాదించారు. ఈ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. ఏపీ సివిల్ న్యాయస్థానాల(సవరణ) బిల్లును మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ వినియోగాధికార చట్టాలు (రద్దు) బిల్లును మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశ పెడితే సభ్యులు అమోదించారు. ఏపీ దుకాణాలు, సంస్థల (సవరణ) బిల్లును మంత్రి పితాని సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు అమోదించారు. ఏపీ గృహనిర్మాణ మండలి (సవరణ) బిల్లును పురపాలకశాఖ మంత్రి పి నారాయణ సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల (సవరణ) బిల్లును ఉపముఖ్యమంత్రి(రెవిన్యూ) కెఇ కృష్ణమూర్తి సభలో ప్రతిపాదించారు. దీనిపై మాత్రం సభ్యలు కొద్ది సేపు చర్చించి వారి సూచనలను, సలహాలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వం విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులుకు చెందిన భూమి వివరాలను ఆన్‌లైన్‌లో రాత్రికి రాత్రే మార్చేశారని చెప్పారు. దీనిపై విచారణ జరిపినప్పటికీ తప్పు చేసిన వారికి శిక్ష పడలేదన్నారు. భూరికార్డుల తారుమారు చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా మార్పులు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ తరువాత రెవెన్యూ రికార్డుల నమోదుకు తహశీల్దార్‌లు, ఆర్డీవోలు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడం లేదన్నారు. దీనికి సంబంధించి నిర్దిష్టమైన కాలవ్యవధి ఇచ్చి, కాని పక్షంలో వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయాలని పలువురు సభ్యులు తెలిపారు. ఏపీ వివాహాల నిర్బంధ నమోదు (సవరణ) బిల్లును శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సభలో ప్రవేశపెట్టారు. దీనిపై కొద్ది సేపు చర్చించిన సభ్యులు కొన్ని సూచనలు చేసి బిల్లును ఆమోదించారు. వౌల్వి అబ్దుల్ హక్ ఉర్దూవిశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు ను మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు(సవరణ) బిల్లును రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టగా కొద్దిసేపు సభ్యులు దీనిపై చర్చించారు. ఏపీ నేర విచారణ స్కృతి (సవరణ) బిల్లును న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. నగరపాలక సంస్థలు, ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి సంస్థల (సవరణ) బిల్లును పురపాలకశాఖ మంత్రి పి నారాయణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదించారు.