ఆంధ్రప్రదేశ్‌

భక్తుల సేవలకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 9: కృతయుగ దైవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనార్థం సింహగిరికి తరలి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి స్వచ్ఛంద సేవకులు ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సింహాచలం దేవస్థానం పత్రికా ప్రకటన విడుదల చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా సేవకులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సేవకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. భక్తుల సేవలకు మేమున్నామంటూ సుమారు 400 మంది దేవస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను ఈవో రామచంద్రమోహన్ పరిశీలించి స్వచ్ఛంద సేవకులకు సంబంధించి విధి విధానాలు రూపొందించమని సిబ్బందిని ఆదేశించారు. తిరుమల శ్రీవారి సేవ పేరుతో సేవలందిస్తున్న వారి తరహాలోనే ఇక్కడ సింహాచలేశుని భక్తుల సేవకులకు కూడా నిబంధనలను రూపొందించాలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు. 65 సంవత్సరాలలోపు ఉన్నవారిని సేవకులుగా తీసుకోవాలని దేవస్థానం భావిస్తోంది. వీరందిరికీ దేవస్థానమే స్వయంగా గుర్తింపు కార్డులు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? విథులు నిర్వహించాలి.. ఏ ఏ రోజుల్లో నిర్వహించాలన్నదానిపై కూడా సేవకులకు స్పష్టతనివ్వాలని అధికారులు భావిస్తున్నారు.
భక్తుల సేవల్లో నిష్ణాతులైన సేవా సంస్థల నిర్వాహకులతో వీరికి శిక్షణ ఇప్పించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలతో పాటు దేవస్థానం ప్రచార రథం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రథంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వేడుకల్లో భాగస్వాములయ్యే విధంగా సేవకులను కార్యోన్ముఖులను చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
దేవస్థానంలో భక్తులకు సేవలందించేందుకు ప్రస్తుతం కొంత మంది స్వచ్ఛంద సేవకులు వస్తున్నారు. విశేష ఉత్సవాలు, రద్దీ సమయాలలో దేవస్థానం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. ఇలా వస్తున్న కొంత మందిలో చిత్తశుద్ధి లోపిస్తోంది. ప్రధానంగా ఉత్సవాల రోజుల్లో వచ్చే స్వచ్ఛంద సేవకులు దర్శనం, ప్రసాదాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.