రాష్ట్రీయం

విభజన హామీలు నెరవేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: రాష్ట్రాలు బలపడాలంటే కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బెంగుళూరు విధానసౌధలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన 28వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి యనమల హాజరయ్యారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమస్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండేళ్ల విరామానంతరం జరిగిన ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో నాడు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు, కోస్తా తీరంలో మత్స్యకారుల సమస్యలు, ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ, పర్యాటక అభివృద్ధి, కేంద్ర పథకాలపై మంత్రి యనమల కూలంకషంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు అమలుచేయలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంతో ఐదుకోట్ల మంది ఆంధ్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విభజన చట్టంలో చెప్పినవి, నాటి ప్రధాని ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. చట్టంలో ప్రధానంగా ఇచ్చిన 14 హామీలు, ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన ఆరు హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. షెడ్యూల్ 9,10,11,13లో ఉన్న అంశాలలో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. షెడ్యూల్ 9,10లో ఉన్న ఆస్తులు, అప్పుల పంపకాలు ఇప్పటి వరకు జరగలేదని వివరించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. కోస్తాతీరంలో ఉన్న మత్స్యకారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ 16.5 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 70వేల 284 మందికి బయోమెట్రిక్ ఐడీ కార్డులు, 70వేల 517 మొబైల్ నెంబర్లను మంజూరు చేసిందని, మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తగిన నిధులు మంజూరు చేయాలన్నారు. దేశంలోనే అత్యధిక తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి రూ 1533 కోట్లు అవసరమని అందులో కేంద్రం రూ 766 కోట్లు గ్రాంట్ కింద విడుదల చేయాలని కోరారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి రూ 100 కోట్లు కేటాయించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలసి చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగ అభివృద్ధికి చెన్నై, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలను కలుపుతూ ఒక పర్యాటక రైలును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను నిర్దిష్ట కాలపరిమితితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం, గిరిజన విశ్వవిద్యాలయాలకి ఇప్పటి వరకు అనుమతులు మంజూరు కాలేదన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి మంజూరైన కేంద్రీయ వ్యవసాయ విద్యాలయం కూడా ఏర్పాటు కాలేదన్నారు. కేవలం రూ 135 కోట్లు మాత్రమే ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి మంజూరు చేసిందన్నారు. రాష్ట్రానికి మంజూరైన 11 జాతీయ విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే రూ 12వేల 746.38 కోట్లు అవసరమవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం 746.13 కోట్లు కేటాయించిందన్నారు. షెడ్యూల్ 8,9,10కి సంబంధించి సంస్థల బదలాయింపు, పంపకాలు జరపలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి దక్షిణాది జోనల్ కౌన్సిల్ స్పందించాలని కోరారు.

చిత్రం..బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు