ఆంధ్రప్రదేశ్‌

మిట్స్‌లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ పరిశోధనా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 18: చిత్తూరు జిల్లా అంగళ్ళు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొదలకు రంగాల్లో పరిశోధన, పారిశ్రామికవిద్య, సాంకేతిక శిక్షణలకు సంబంధించి అత్యాధునిక అడ్వాన్స్‌డ్ రోబోటిక్ పరిశోధన కేంద్రం (ఏఆర్‌సి)ను జర్మనీ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం రాత్రి మిట్స్ కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్‌చౌదరి వెల్లడించారు.
ఇందుకు సంబంధించి జర్మనీలోని ఆర్‌డబ్ల్యూటిహెచ్ ఆచెన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మిట్స్ కళాశాల, జేసీ జర్మన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, జర్మనీ ఆచెన్ విశ్వవిద్యాలయం యూరోపియని సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఎపిఎస్ జిఎంబిహెచ్‌ల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరిందని వెల్లడించారు. ఈ ఒప్పందపత్రంపై డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్‌చౌదరి, జర్మనీ ప్రభుత్వ సంస్థల తరపున డాక్టర్ టిల్‌క్వాడ్ ఫ్లీగ్, డాక్టర్ క్రిస్ట్ఫోగ్రేబ్ సంతకాలు చేశారు. అడ్వాన్స్‌డ్ రోబోటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 40వేల యూరోస్ జర్మనీ ప్రభుత్వసంస్థలు అందజేస్తారని తెలిపారు.
రోబోల తయారీ, వాటి వినియోగం, తయారీకి కావాల్సిన పరిజ్ఞానం జర్మనీ దేశానికి చెందిన ప్రొఫెసర్లచే మిట్స్ కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తద్వారా భారతదేశం, జర్మనీ కంపెనీల పరిశోధనలను విద్యార్థులతో చేయించి, అందుకు కావాల్సిన రీసెర్చ్ ఫండ్‌ను విద్యార్థులకు కలిగేలా చేయుటకు ఈ ఒప్పందం చాలా ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) వారు విద్యార్థులకు కావాల్సిన ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం తరపున అందజేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా, ఇతర దేశాల పరిశోధనలు మనరాష్ట్రం కేంద్ర బిందువుగా మారేందుకు ఇదొక మంచి అవకాశం అన్నారు.

చిత్రం..జర్మనీ ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్న మిట్స్ కరస్పాండెంట్