ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్‌పై ప్రభుత్వం తప్పించుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: సీపీఎస్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా శాసన మండలిలో తప్పించుకుంటే సరిపోదని, ప్రజలకు సమాధానం చెప్పక తప్పని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ వి బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, యండవల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సిపిఎస్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావించారని, కానీ ప్రభుత్వం దాట వేసిందన్నారు. చెప్పిందే చెప్పి సభను వాయిదా వేశారని, ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం తమ ఆగ్రహాన్ని వ్యక్తపరచడం కాయమన్నారు. సిపిఎస్ భూతం టీడీపీని వెంటాడుతుందని, టీడీపీ ప్రభుత్వం ఈ శాసనసభ సమావేశాల్లో ఏమీ తేల్చకుండా వంచన చేసిందన్నారు. ఎమ్మెల్యే ఒక్కరోజు పని చేసినా 30వేలు పెన్షన్ ఇస్తున్నారని, 30, 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే ఆందోళనలో తాము భాగస్వాములవుతామని అన్నారు.
పెన్షన్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్సీ గాదె
2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పెన్షన్ అమలు చేయాల్సిందేనని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగుల నుంచి జమ అయిన పదిశాతం, రాష్ట్రం ఇచ్చిన 10శాతం, మొత్తం 2018 జూన్ నాటికి ఏడు వేల కోట్లు కేంద్రం వద్ద ఉందని, రాను రాను 10శాతం ఇవ్వడం రాష్ట్రాలకు కూడా కష్టంగా ఉంటుందన్నారు. పెన్షన్ ఉద్యోగుల హక్కుని, 121 జీఓ ప్రకారం పాత పెన్షన్ విధానం రద్దు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్త పెన్షన్ విధానంలో ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ చేరలేదన్నారు. సిపిఎస్ విధానంలో లోపాలున్నాయని, దాన్ని రద్దు చేసే అంశం పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. తమిళనాడులో ఇప్పటివరకు జమ అయిన డబ్బు ఇంకా కేంద్రానికి జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉందని, అంటే సిపిఎస్‌పై స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నట్లేనని అన్నారు.