ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకతతో పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రభుత్వ నిర్దేశానుసారం పోస్టుల భర్తీని సకాలంలో పూర్తి చేసి పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం విజయవాడలోని ఏపీపీఎస్‌సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ఆ జీవో ప్రకారం 18,450 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇందులో టీచర్లు, పోలీసు ఉద్యోగాలు మినహా అన్ని పోస్టులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతుందని, ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అప్ చేయాల్సి ఉందన్నారు. రాబోయే 15 రోజులలోపు రిక్రూట్‌మెంట్ క్యాలండర్ ప్రకారం ఏ పరీక్ష ఎప్పుడు ఉండే అవకాశం ఉందో రూపొందించి యూపిఎస్‌సీ తేదీలకు అనుగుణంగా (క్లాష్ లేకుండా) ఇస్తామన్నారు. గ్రూప్ 1 సిలబస్ ఫైనల్ చేసి కమిషన్ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఈ సారి ప్రిలిమినరీ, మెయిన్స్‌కు ఒకే సిలబస్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ కల్గిన పోస్టుల పరీక్షకు వేర్వేరుగా సిలబస్‌లు ఉండేవని అలా కాకుండా ఒకే విధంగా సిలబస్‌లు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆబ్‌జెక్టివ్ విధానంలో స్క్రీనింగ్, ప్రిలిమినరీ పరీక్షలు ఉంటాయని, 25వేల మంది అభ్యర్థుల కన్నా ఎక్కువ ఉంటే ఒక కటాఫ్ మార్కు పెట్టి అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేస్తామని, ఇందులో ఆయా కేటగిరిలకు చెందిన వ్యక్తులు లేకపోతే ఇంకా వారికి కటాఫ్ తగ్గించి ఎంపిక చేస్తామన్నారు. గతంలో ఒక పోస్టుకి 50 మందిని ఎంపిక చేసే వారని ఈ సారి జరగబోయే అన్ని పరీక్షలకు కటాఫ్ మార్కు ప్రకారం తీసుకుంటామన్నారు. అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు వారు పొందిన మార్కులను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. పరీక్షలు జరిగిన రోజు సాయంత్రమే కీని విడుదల చేస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుని రివైజ్‌డ్ కీ మొదటి సారి, అవసరమైతే రెండవసారి కూడా అభ్యంతరాలు తీసుకుని ఫైనల్ కీని విడుదల చేస్తామన్నారు. ఏపీపీఎస్‌సీ కార్యదర్శి ఏకే వౌర్య, మెంబర్లు జీఎస్ సీతారామరాజు పాల్గొన్నారు.