ఆంధ్రప్రదేశ్‌

ఇది పేదల ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: ప్రభుత్వం పేదరిక నిర్మూలన..ఆర్థిక అసమానతల తొలగింపు లక్ష్యంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బుధవారం శాసనసభలో 344 నిబంధన కింద గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదవారికి పనికల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలకు రక్షణగా ఉంటామని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో మహిళను వేధింపులకు గురిచేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదుచేసి శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. గతంలో తానుచేసిన పాదయాత్ర అనుభవాల నేపథ్యంలో సమాజంలో అన్నివర్గాల్లో పేదలను ఆదుకోవాలని సంకల్పించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. అభివృద్ధిలో చరిత్ర సృష్టించామని సంక్షేమం, అభివృద్ధిలో సమతుల్యత పాటిస్తామన్నారు. గిరిజన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా కార్పొరేట్‌కు ధీటుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దామన్నారు. సంక్షేమ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు రూ 487.11 కోట్లు ఖర్చు చేశామన్నారు. భూముల కొనుగోలుతో ఎస్సీ, ఎస్టీ పేద వర్గాలకు స్థిరాస్థి కల్పిస్తున్నామని గత కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యమైన ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసిలను పునరుద్ధరించి రెండు లక్షల మందికి రూ 2834 కోట్లతో ప్రయోజనం కల్పించామని వవిరించారు. ట్రైకార్ ద్వారా గిరిజన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికీ సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీపడలేదన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యువతకు భవిత కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రతిభ కుంటు పడిందన్నారు. ఈ నేపథ్యంలో 16వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నైపుణ్యతా శిక్షణతో పాటు ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం మార్గం సుగమం చేసిందన్నారు. ఏ వర్గానికి లోటు రాకుండా ఆదుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాది 6.7 లక్షల మందికి శిక్షణ నిచ్చి 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఈ ఏడాది నైపుణ్యతా శిక్షణలో 8 లక్షల మందిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పరిశ్రమల ద్వారా 3.3 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. యువనేస్తం పథకాన్ని ప్రజా సాధికార సర్వే ద్వారా గుర్తించి నిరుద్యోగ భృతితో ఆదుకుంటుందని తెలిపారు. దేశంలోనే ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే పథకం ఇదే అన్నారు. పితాని సత్యనారాయణ మాట్లాడుతూ బీమా పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.