ఆంధ్రప్రదేశ్‌

సైబర్ సెక్యూరిటీ పరిధిలోకి సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ వెలగపూడి సచివాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సందర్శకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో సందర్శకులకు ఆధార్ తప్పని సరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించింది.
సచివాలయంలో ఉచిత వైఫై, ఇంటర్ నెట్ వినియోగిస్తున్న అధికారులు, సందర్శకులు, మీడియా ప్రతినిధులకు ఇక నుండి ఇంటర్‌నెట్ వినియోగంపై అంక్షలు విధించింది. దీనికి సంబంధించి వైఫై, ఇంటర్‌నెట్‌ను వినియోగించే ప్రతీ ఒక్కరూ వారి ల్యాప్‌టాప్, మొబైల్‌ల ఐపీ అడ్రస్‌ల వివరాలు అందించాల్సి ఉంటుంది. సైబర్ నేరాలు, హ్యాకింగ్ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు ఎంతో అవసమని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. అయితే సైబర్ సెక్యూరిటీ పేరుతో ఇతరుల ఐపీ అడ్రస్‌లు తీసుకోవడం తగదని ఉద్యోగులు, ఇతర సిబ్బంది అంటున్నారు.