ఆంధ్రప్రదేశ్‌

పోలవరంలో కొత్త భూసేకరణకు సీడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: పోలవరం ప్రాజెక్టులో సవరించిన భూసేకరణకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు అవసరమైన భూసేకరణకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు అవసరమైన భూసేకరణతోపాటు, పునరావాస, పునర్నిర్మాణానికి, పునరావాస కాలనీలు, భూమికి భూమి తదితర అన్ని రకాల భూసేకరణకు సత్వరం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం భూసేకరణపై అన్ని కోణాల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల మేరకు సవరించిన మేర భూసేకరణ చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి ఆదేశించారు. గురువారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి భూసేకరణ సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు. 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం ప్రకారం సేకరించిన వివరాలను తెలియజేయాల్సి ఉదన్నారు. 2014 సంవత్సరంలో ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో కొద్దిపాటి సవరణలు చేయాల్సివుందన్నారు. పునరావాసానికి సంబంధించి సత్వర నివేదిక సమర్పించాలన్నారు.
సమీక్షలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఇరిగేషన్ డిప్యూటీ సీఈ నాగిరెడ్డి, గంగిరెడ్డి, ఈ ఈ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
కాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 1,66,213 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 1,10,355 ఎకరాలు సేకరించారు. ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి సుమారు రూ.5045 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 55,858 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూమి కాకుండా ఇంకా అదనపు సేకరణకు విలీన మండలాల్లోనూ, ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి సవరించిన భూసేకరణకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలిక చోటు చేసుకుంది. ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించి పరిహారాన్ని కూడా సత్వరం పూర్తిచేసి, 2019 నాటికి గ్రావిటీపై విశాఖ వరకు నీరందించాలంటే ముందుగా అవసరమైన భూసేకరణ పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.