ఆంధ్రప్రదేశ్‌

పేదలకు ఇళ్లొస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ పథకం కంటే భిన్నంగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ అట్టహాసంగా సొంత గూడు సౌకర్యం కలుగచేస్తానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్లుగా ఊరూవాడా విస్తృత ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ నేత వర్ల రామయ్యను గృహ నిర్మాణ సంస్థకు చైర్మన్‌గా కూడా నియమించారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 1250 గృహాలు చొప్పున రాష్ట్రంలో రెండు లక్షల 18వేల 750 పక్కా గృహాలను నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయించారు. అయితే ఒక్కో యూనిట్‌కు రెండున్నర లక్షలు లేక రెండు లక్షల 75వేలు కేటాయించాలా అన్నదానితో పాటు మరికొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోటానికై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించారు. గత మంత్రివర్గ సమావేశంలో అయితే ఇంటి డిజైనింగ్ బాధ్యతను లబ్ధిదారునికే అప్పగించాలని కూడా నిర్ణయించారు. పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంపై కూడా ఆధారపడి ఉందనేది మరువరాదు.కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎప్పటి నుంచో అమల్లోనున్న ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన - గ్రామీణగా మార్పు చేసి వచ్చే మూడేళ్లలో ఒక కోటి గృహాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. మైదాన ప్రాంతంలో అయితే లక్షా 20వేలు, కొండలు, కష్టమైన ప్రాంతాల్లో అయితే లక్షా 30వేలు సహాయం అందజేయబడుతుంది. గ్రామసభలు నిర్వహించి కేంద్రం వద్దనున్న సామాజిక ఆర్థిక కుల గణన 2011 ‘సెక్’ సమాచారం జాబితా నుంచి లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. కేంద్రం అందించే సాయం పోగా మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. లబ్ధిదారుల ఎంపికకు విధి విధానాలనేకం ఉండటం ఒక ఎత్తు అయితే 13 రకాల కఠినతర ఆంక్షలను విధించింది. ఈ పదమూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ గృహస్థుల పేర్లు యాంత్రికంగానే తొలగించబడటం రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యమంత్రి రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ ఆంక్షలను తొలగించే విషయమై నేరుగా కేంద్రంతో మాట్లాడనున్నారని హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య వెల్లడించారు. ఏమిటా ఆంక్షలు అంటే.. మూడు నాలుగు చక్రాలు కాదు కదా మోటారు ద్విచక్ర వాహనం కూడా ఉండరాదు. వేటపడవ, యంత్రంతో నడుపు 3, 4 చక్రాలు గల వ్యవసాయ పనిముట్లు, టెలిఫోన్, రిఫ్రిజిరేటర్, రూ.50వేలు మించి పరిమితి కల్గిన కిసాన్ క్రెడిట్ కార్డు కల్గి ఉండరాదు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంలో సొంత డబ్బు కొంత కల్పి మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆకాంక్షతో బ్యాంక్‌ల్లో డబ్బు పొదుపు చేసుకున్నవారెందరో ఉంన్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. నెలకు 10వేలు మించి సంపాదించరాదు. ఆదాయపుపన్ను, వృత్తిపన్ను కట్టరాదు. ఇక కనీసం ఒక వ్యవసాయ పనిముట్టుతో పాటు సొంత వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాలు అంత కంటే ఎక్కువ ఉండరాదు. కాగా ఇప్పటికే పలు గ్రామాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు ఈ విధమైన ఆంక్షలతో దరఖాస్తు ఫారాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ ఆంక్షలను చూసి ప్రతి ఒక్కరూ బిత్తరపోతున్నారు. భిక్షతో నివసిస్తున్నవారు, మరుగుదొడ్లు శుభ్రం చేయువారు, ఆదిమ గిరిజన గుంపులు చట్టబద్ధంగా విడుదలైన వెట్టిచాకిరి వారు అయితే మాత్రం యాంత్రికంగా చేర్చడానికి అవసరమైన అర్హతలు కల్గి ఉంటారు. ఇక దరఖాస్తుల పరిశీలనలో ఒక స్థాయి కమిటీ ఆ పిదప ఖరారు చేయటంకై కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి ఒకరు, ప్రభుత్వ అధికారి ఒకరు, ప్రభుత్వేతర వ్యక్తి ఒకరితో త్రిసభ్య అప్పిలేట్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది.