ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి దుర్గమ్మ గుడిలో దసరా ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మవారి సన్నిధిలో అక్టోబర్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారి దసరామహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ, చైర్మన్ వీ గౌరంగబాబు తెలిపారు. గురువారం సాయంత్రం అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అందరికీ అమ్మవారి దర్శనం కలిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భక్తులకు అప్పం ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని దసరా మహోత్సవాల నుండే ప్రారంభిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఇదేవిధంగా వీఐపీలు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా గత దసరా మహోత్సవాల్లో చేసిన విధంగా ఈసంవత్సరం కూడా పున్నమి ఘాట్ నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విజయదశమి రోజున అమ్మవారు ఉదయం శ్రీ మహిషాశురమర్ధనీ దేవి అలంకారం, మధ్యాహ్నం నుండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ మహోత్సవాలు సందర్భంగా ప్రతిరోజు అమ్మవార్లకు నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.