ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను ప్రజల్లో ఎండగట్టడానికి ఇకనుండి కంకణం కట్టుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో గురువారం జరిగింది. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మీడియాకు దూరంగా సాగిన ఈ అంతర్గత సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధానంగా రాంమాధవ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడినట్టు తెలిసింది. అలాగే పార్టీ శ్రేణులను రానున్న ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడానికి రాంమాధవ్ దిశానిర్దేశం చేశారు. నాలుగైదు అసెంబ్లీ సీట్లు మాత్రమే కలిగివున్న రాష్ట్రాల్లో నేడు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిందని, ఆయా రాష్ట్రాల కంటే చాలా ముందుగానే ఆంధ్రపదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావల్సి ఉన్నా ఆ విధంగా ఎందుకు సాధ్యం కాలేదో శ్రేణులు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాంమాధవ్ సూచించినట్టు సమాచారం. సమైక్యంగా, సఖ్యతతో మెలుగుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో రాష్ట్రంలో నేడు అభివృద్ధి పనులు జరుగుతున్నా ఆ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేని దుస్థితిలో మనం ఉన్నాం కదా? అని ప్రశ్నించారు. కేంద్ర నిధులు కోట్లలో దుర్వినియోగం అవుతున్నప్పటికీ ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? అని ప్రశ్నించారు. నీరు-చెట్టు పథకం కింద కొన్ని కోట్ల స్కాం జరిగిందని, ఆ నిధులన్నీ దేశం నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికై కేంద్రం విడుదలచేసిన వేల కోట్ల నిధులను పీడీ ఖాతాలు తెరిచి దారి మళ్ళించిన కుంభకోణాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా రాంమాధవ్ ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంథ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్ధిక సహాయం అందించిన కారణంగానే రెండంకెల వృద్ధి సాధ్యమయిందని, ఇటువంటి వాస్తవాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలన్నారు.
కేంద్ర నిధుల మళ్ళింపు, పెట్టుబడులకు ఆహ్వానం, ధర్మపోరాట దీక్షల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళించి, భారీ అవినీతికి పాల్పడుతోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

చిత్రం..రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రాంమాధవ్