ఆంధ్రప్రదేశ్‌

నీటి తరలింపునకు అవుకు టనె్నల్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 20: గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువకు అవుకు రిజర్వాయర్ నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవుకు టనె్నల్‌ను జలవనరులశాఖ సిద్ధం చేసింది. 12 ఏళ్ల క్రితం టనె్నల్ పనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 401 కోట్ల వ్యయంతో ఎన్‌సీసీ, మైథాస్ జాయింట్ సంస్థ ఈపీసీ విధానం ద్వారా ఈ పనులు దక్కించుకుంది. 30 నెలల వ్యవధిలో పనులు పూర్తికావాల్సి ఉండగా నేటికీ కొనసాగుతునే ఉన్నాయి.
ఇప్పటికి 83 శాతం పనులు పూర్తయినట్లు జలవనరుల శాఖ ఆధికారులు వెల్లడిస్తున్నారు. గత ఏడాది ఇదే టనె్నల్ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని ట్రయల్ రన్‌గా తరలించారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు టనె్నల్‌ను సిద్ధం చేశారు. టనె్నల్ నిర్మాణంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పనుల నిర్వహణలో జాప్యం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు నిధుల విడుదలలో అలసత్వం చూపడం కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు.
ఇప్పటికీ టనె్నల్ నిర్మాణం పనులు కొనసాగుతున్నప్పటికీ గత ఏడాది నుంచి టనె్నల్‌లోనే బైపాస్ టనె్నల్‌ను నిర్మించి నీటి తరలింపు పక్రియను ప్రభుత్వం చేపట్టింది. నేటికీ 13 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అవుకు టనె్నల్ పూర్తయితేనే కడప జిల్లాలోని గండికోట జలాశయానికి నీటిని తరలించి అక్కడి నుంచి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే అవకాశం ఉంది. అవుకు టనె్నల్ పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖ ముఖ్య అధికారులు పేర్కొంటున్నారు. టనె్నల్ మధ్య భాగంలో కొన్ని వందల మీటర్లు మెత్తని కొండ ప్రాంతం ఉండడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇంజినీర్లు అవుకు టనె్నల్‌ను క్రియాశీలక దశకు తీసుకొచ్చారు.
ఒకపక్క పనులు జరుపుతూనే మరోపక్క రాయలసీమ రైతులకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు లభిస్తోంది. ఈనెల 22వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు నీరు విడుదల చేయనున్నారు.

చిత్రం.. అవుకు టనె్నల్ వెలుపలి భాగం