ఆంధ్రప్రదేశ్‌

నెలాఖరుకు పుష్కర పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అన్ని నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాలని, ముఖ్యంగా స్నాన ఘట్టాల నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చినందున ఇక యాత్రికులకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంత్రులు ఇరువురు శనివారం జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణలో పుష్కరాల ప్రత్యేక అధికారి బి రాజశేఖర్, దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ, కలెక్టర్ బాబు ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సిపి గౌతం సవాంగ్ పలువురు శాసనసభ్యులు, పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపారు. పుష్కర పనులు శాశ్వత ప్రాతిపదికన విజయవాడ నగర శోభను ఇనుమడింప చేసేలా పూర్తి నాణ్యతతో జరిగేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ పుష్కర స్నానాలు ఆచరించే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పులిచింతల ప్రాజెక్టు వద్ద 2.06 టిఎంసిల నీటిని నిలువ ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ కృష్ణా జిల్లాలోనే అధికారికంగా కనీసం మూడున్నర కోట్ల యాత్రికులు పుష్కరాలకు వచ్చే అవకాశముందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ యాత్రికులు ఆరు రకాలైన పూజలు నిర్వహించాలని భావిస్తారు. వీటికి 40 రకాలైన పూజాద్రవ్యాలు అవసరమవుతాయని అన్నారు. కలెక్టర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 74 ఘాట్లు, 21 బస్ స్టేషన్‌లు నిర్మించడం జరుగుతుందన్నారు. ఆరు ప్రాంతాల్లో బెయిలీ బ్రిడ్జీలు నిర్మిస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ముక్త్యాల వేదాద్రి, సాగర సంగమం, హంసలదీవి ప్రధాన ఘాట్ల వద్ద కూడా పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా పుష్కర యాత్రికులకు అనువుగా రోడ్ మ్యాప్ తయారు చేసామన్నారు. పుష్కరాల ప్రత్యేక అధికారి బి రాజశేఖర్ మాట్లాడుతూ కర్మకాండలకు అవసరమైన పదార్ధాలను సేకరించి నిర్ణీత ధరలకు విక్రయించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని సూచించారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి దేవినేని ఉమ