ఆంధ్రప్రదేశ్‌

నా జోలికొస్తే మీ కథలన్నీ బయటపెడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యం చేస్తున్నది తనకోసం కాదని, భావితరాల కోసమని సినీనటుడు శివాజీ స్పష్టం చేశారు. అయితే కొందరు తనకు సామాజికవర్గాలను అంటగడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తన జోలికొస్తే వారి కథలను సీరియల్స్‌గా తీస్తానని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను శివాజీ హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం భారత రాజ్యాంగ పరిరక్షణ మహార్యాలీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధ్యక్షతన జరిగింది. సభలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలను గెలిపించింది ప్రజా సమస్యలను పరిష్కరించడానికేనని గుర్తుంచుకోవాలన్నారు. దళితులు, ముస్లింల సమస్యలను ప్రస్తావించేందుకు జగన్ అసెంబ్లీకి వెళ్లరా అని ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ గురించి తాను చెబితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎలా తెలుసని ప్రశ్నించారని, అన్ని పార్టీలలో తన మనుషులు ఉన్నారని తెలిపారు. తాను చెప్పిన విధంగానే ఆపరేషన్ గరుడ కర్ణాటకలోనూ ప్రారంభమైందన్నారు. ప్రభుత్వాలను అస్థిరపర్చే చర్యలకు తాను వ్యతిరేకమని, అది ఆపరేషన్ గరుడలో భాగమేనన్నారు. సఎం అవ్వాలని అందరికీ ఉంటుందని, అయితే అది ఏ ఒక్కరికో దక్కుతుందన్నారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, మోదీ, అమిత్‌షాలకే వ్యతిరేకమని నటుడు శివాజీ స్పష్టంచేశారు.