ఆంధ్రప్రదేశ్‌

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో తూ.గో.జిల్లాకు ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 22: మాతా శిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా అమలుచేస్తున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలకు తూర్పు గోదావరి జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. గర్భిణులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంచేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం 32 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా ఈ సేవలందిస్తున్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 13501 మంది గర్భిణిలను ఆసుపత్రులకు తరలించి రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం సాధించారు. ఆసుపత్రిలో చేరేందుకు సిద్ధమయ్యే గర్భిణిలు 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సకాలంలో వాహనం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే సకాలంలో గర్భిణిలను ఆసుపత్రికి చేర్చడంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తోంది.
108 తరహాలో 102 వాహనం పట్ల కూడా నమ్మకం ఏర్పడింది. వాహనంలో సకాలంలో ఆసుపత్రిలో చేర్చడం వలన వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఉండేందుకై మార్గం సుగమం అయ్యింది. కాగా గర్భిణులకు ప్రభుత్వాసుపత్రుల్లో సకాలం వైద్య పరీక్షలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద లక్షా 69 వేల మందికి 26 విడతల్లో వైద్య పరీక్షలు నిర్వహించగా 22వేల 750 మందిని హైరిస్క్ పేషెంట్లుగా గుర్తించి వైద్య చికిత్స అందజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది జిల్లాలో 31వేల 717 ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినట్టు వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన వారికి జాతీయ ప్రసూతి ఆర్ధిక సహాయం కింద 14వేల 292 మందికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. ఈ సంవత్సరం మాతృత్వ అభియాన్ పథకం కింద 64వేల మంది గర్భిణిలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 30 రిఫరల్ ఆసుపత్రుల్లో 1410 పడకలతో వైద్య సేవలందిస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ మాతా శిశు సంరక్షణ కోసం ఎన్టీఆర్ మదర్‌కిట్స్, ఎన్టీఆర్ బేబీ కిట్స్ అందజేస్తున్నామని, జిల్లాలో చంద్రన్న సంచార వైద్య సేవలనూ అందిస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. జిల్లాలో ఇంతవరకు 2 లక్షల 730 మందికి సంచార వైద్య సేవలందించినట్టు తెలిపారు.