ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వాల్తేరు డివిజన్‌లో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు డివిజనల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ వెల్లడించారు. విశాఖలోన డీఆర్‌ఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పరిధి 1106 కిమీ మేర విస్తరించిన ఉన్న డివిజన్‌లో 80 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి కాగా, కోరాపుట్ - రాయగడ మధ్య 150 కిమీ విద్యుదీకరణ పనులు ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి చేస్తామన్నారు. సంస్థ పరంగా సరకు రవాణాలో గతేడాదితో పోలిస్తే స్వల్ప వృద్ధి నమోదు చేసుకుందన్నారు. గతేడాది 52.7 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగా, ఈ ఏడాది 56.64 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. ఆదాయ పరంగా కూడా గతేడాదితో పోలిస్తే సరకు రవాణాలో వృద్ధి చోటుచేసుకుందన్నారు. సరకు రవాణాలో ఐరన్ ఓర్, కోల్ 65 శాతం కాగా, అల్యూమినియం పౌడర్ ఎగుమతులు పెరిగాయన్నారు.
ప్రయాణికులకు సంబంధించి వౌలిక సదుపాయాల కల్పన విషయంలో డివిజన్ పరిధిలో దాదాపు రూ.15 నుంచి 20 కోట్లతో పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. మర్రిపాలెం, పెందుర్తి, రాయగడ, లడ్డా తదితర స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంపు, విశాఖ, విజయనగరం, రాయగడ, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఉన్నాయన్నారు. డివిజన్ పరిధిలో 41 స్టేషన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తి చేశామన్నారు. నౌపడ - గుణపూర్ స్టేషన్ల మధ్య 90 కిమీ పరిధిలో 58 వరకూ లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయన్నారు. ఈనెలాఖరు నాటికి అన్ని అన్‌మేన్డ్ లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్ సేవలు ఉపయోగించుకుంటామన్నారు. డివిజన్ పరిధిలో కొత్తగా 7 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వీటిలో విశాఖ స్టేషన్‌లో మొడు విజయనగరం, రాయగడ స్టేషన్లలో రెండేసి చొప్పున మంజూరు చేశామన్నారు. కేకేలైన్‌లో తరచు ఏర్పడుతున్న అంతరాయాలను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండవాలు మీదుగా నీటి ప్రవాహాన్ని నియంత్రించే కాలువల నిర్మాణం, అడ్డుగోడల నిర్మాణం చేపట్టామన్నారు.
గూడ్స్ రైళ్ల వేగం పరిశీలన
గూడ్స్ రైళ్లు ప్రయాణించే వేగాన్ని నిర్ధారిస్తూనే నిరంతరం పరిశీలించేందుకు డ్రైవ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసినట్టు డీఆర్‌ఎం వెల్లడించారు. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేసి, గూడ్స్ రైళ్ల గమనంలో 12 శాతం వృద్ధి సాధించగలిగామన్నారు.
విశాఖపట్నం - కిరండోల్ మధ్య నడుపుతున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ చేశామన్నారు. విశాఖ నుంచి నడుస్తున్న గరీబీరథ్, గోదావరి రైళ్లను పొడిగిస్తారన్నది అపోహమాత్రమేనన్నారు. రైల్వేకు ప్రాంతీయ ప్రాధాన్యతలు ఉండవని, ఆ కోణంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వాల్తేరు డీఆర్‌ఎం ముకుల్ శరణ్ మాథుర్