ఆంధ్రప్రదేశ్‌

నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: సంక్షేమ పథకాలు, చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు అందించే నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు పాల్పడితే సివిల్ కోర్టుగా వ్యవహరించి ప్రాసిక్యూట్ చేసే అధికారం తమ కమిషన్‌కు ఉందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ అన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చైర్మన్ జే పుష్పరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అటువంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సబ్సిడీ బియ్యాన్ని అందించడంతోపాటు సక్రమంగా అమలు జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందించే అధికారం కలిగి ఉన్నదన్నారు. కమిషన్‌కు సివిల్ కోర్టుగా వ్యవహరించే అధికారం ఉందన్నారు. ప్రాసిక్యూషన్, ఆస్తుల జప్పు, స్వాధీనం వంటి అధికారాలు కమిషన్‌కు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 339 ప్రతికూల వార్తలపై సమగ్ర విచారణ జరిపి 145 కేసుల్లో తుది నివేదికను అందించామని మరో 194 కేసుల్లో రిపోర్టు రావాల్సి ఉందని చైర్మన్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు పోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రేషన్ దుకాణాలకు పాలిష్ లేని బియ్యం సరఫరా చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, అధికారులు పాల్గొన్నారు.