ఆంధ్రప్రదేశ్‌

30న గుంటూరులో బీసీ గుండెచప్పుడు సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు న్యాయానికి సమాధి కడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 30వ తేదీన గుంటూరులో జరగనున్న బీసీ గుండెచప్పుడు భారీ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేఖర్లతో కేశన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు సామాజికన్యాయం, రాజ్యాధికారం దక్కకుండా అధికారాన్ని కొందరు తమ గుప్పిట పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల్లోనూ, వివిధ కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌లు, చైర్మన్‌ల నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చట్టసభల్లో మాత్రం రిజర్వేషన్లు కల్పించకుండా దగా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా పెరిగినా ఆ మేరకు రిజర్వేషన్లు మాత్రం పెరగలేదన్నారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకే 30న గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కేశన తెలిపారు.