ఆంధ్రప్రదేశ్‌

గొప్పల కోసం అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: అమెరికాలో ప్రైవేట్ సంస్థ నిర్వహించే సమావేశానికి వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆయన అనుచరగణం, టీడీపీ నాయకులు గొప్పల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమెరికాలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారు చెప్పిందే నిజమైతే ఐక్య రాజ్య సమితి పంపిన ఆహ్వానపత్రాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎకనామిక్ ఫోరం అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న సమావేశానికి, ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూయార్క్‌లో పెడుతున్న రెండో సమావేశమని వివరించారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టును నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యం చేసి సంక్రాంతిలోగా ఎలా పూర్తి చేస్తారో బాబు తెలుపాలన్నారు. ప్రకాశం జిల్లాను బాబు చిన్నచూపు చూస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీపై కాగ్ నివేదికను ఓసారి పరిశీలిస్తే టీడీపీయే కాంట్రాక్టు పనులు చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. రూ. 1407 కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు కింద ఇచ్చినట్లు చెబుతున్నా ఇందుకు సంబంధించిన ఆధారాలు లేవన్నారు. అలాగే చేయని పనులకు రూ. 1853 ఖర్చు చూపుతున్నారన్నారు.
అలాగే మరో పనిలో కాంట్రాక్టర్‌కు అదనంగా రూ. 1331 కోట్లు ఇచ్చారన్నారు. ఆయా కాంట్రాక్టర్ చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీ, సబ్ కాంట్రాక్టర్‌ల డబ్బులు రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తున్నదని జీవీఎల్ ప్రశ్నించారు.