ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు రొట్టెల పండుగకు.. పోటెత్తిన భక్త జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 23: నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో మూడో రోజైన ఆదివారం దర్గా ప్రాంగణం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సుమారు 5 లక్షల పైబడి భక్తులు ఆదివారం పండుగకు విచ్చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులతో పాటు పలువురు విఐపిలు కూడా దర్గాను సందర్శించి మృతవీరుల సమాధుల వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి తదితరులు పండుగకు హాజరైన వారిలో ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొంగూరు నారాయణ గత మూడు రోజులుగా దర్గా పరిసరాల్లోనే తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తరచూ తన పర్యటనలతో అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి జరిగిన గంధోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. నిద్రపోకుండా మేల్కొని గంధ మహోత్సవాన్ని తిలకించి అనంతరం గంధం కోసం అందరూ తీవ్రంగా ప్రయత్నించారు. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల తాకిడిని తట్టుకునేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతున్నారు. విఐపిలను ఆది, సోమవారాల్లో రావొద్దంటూ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ పలువురు విఐపిలు రావడంతో వారికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం పోలీసులకు భారంగా మారింది.
పండుగకు హాజరైన పవన్‌కల్యాణ్
జనసేన వ్యవస్థాపకులు పవన్‌కల్యాణ్ ఆదివారం నెల్లూరులో రొట్టెల పండుగకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రొట్టెను స్వీకరించారు. అనంతరం దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో సినీనటుడు అలీతో కలిసి పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
అంతక్రితం దర్గాలో ఆదివారం జనసమ్మర్ధం ఎక్కువగా ఉండడంతో తొలుత పోలీసులు పవన్‌కల్యాణ్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. 10 గంటలకే నెల్లూరు చేరుకున్న ఆయన పోలీసుల అనుమతి కోసం చూసి చివరకు మధ్యాహ్నం రెండు గంటలకు దర్గాకు చేరుకున్నారు.
ఈ సమయంలో పవన్‌కల్యాణ్ చూసేందుకు అక్కడి భక్తులు ఉత్సాహం చూపిస్తూ కేరింతలు కొడుతూ ఆయన వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.

చిత్రాలు.. నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ప్రార్ధనలు చేస్తున్న మంత్రులు పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు
*రొట్టెల పండుగకు భారీగా తరలివచ్చిన జనసందోహం