ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది ఫ్లాప్‌షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 24: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారని, అది ఓ ఫ్లాప్‌షో అని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్‌నాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పాదయాత్ర ఆసాంతం చంద్రబాబు నామస్మరణ తప్ప ఆయన సాధించిందేమీ లేదన్నారు. ఒక్క సందర్భంలో అయినా కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. దేశ రక్షణను గాలికొదిలేసి యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినా జగన్ నోరుమెదపక పోవటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రతకు నష్టం తెచ్చే చర్యలను, దళితులపై దాడులను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా, విభజన హక్కులపై వెన్నుచూపి పరారైన జగన్‌కు ప్రజాక్షేత్రంలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం, విభజన హామీలపై నోరుతెరిస్తే కేసులు చుట్టుకుంటాయనే భయంతోనే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని దు య్యబట్టారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దౌర్భాగ్యమన్నారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టిన జగన్ ఇప్పుడు దేశ ప్రయోజనాలను ఢిల్లీ పెద్దల పాదాక్రాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని పన్నుతున్న కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారని మంత్రి అమరనాథ్‌రెడ్డి హెచ్చరించారు.