ఆంధ్రప్రదేశ్‌

సముద్ర ఉత్పత్తులకు ఎగుమతుల హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తీరంలో పరిశోధనలకు ‘డోయర్’ సంసిద్ధత
* రూ. 200కోట్లతో మెరైన్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ వింగ్ ఏర్పాటు
* ముఖ్యమంత్రితో సంస్థ ప్రతినిధుల భేటీ

** ***************************

అమరావతి, సెప్టెంబర్ 24: సముద్ర ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా రూపుదిద్దుకునేందుకు అవసరమైన పరిశోధనా సహకారాన్ని అందించేందుకు అమెరికాకు చెందిన డోయర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులోభాగంగా రూ. 200 కోట్లతో మెరైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మెరైన్ టెక్నాలజీలో శాస్తవ్రేత్తలు, టెక్నీషియన్లకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సముద్రగర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థగా పేరుగాంచిన ఓషియన్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చి (డీఒఈఆర్) ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో 974 కిలోమీటర్లకు పైగా కోస్తాతీరం ఉందన్నారు. సుదీర్ఘమైన కోస్తాతీరాన్ని సముద్ర ఉత్పత్తుల, ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆక్వా రంగం అభివృద్ధిలో అపారమైన అవకాశాలకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 1992లో డాక్టర్ సిల్వియా ఈరే నేతృత్వంలో డోయర్ సంస్థ ఏర్పాటైంది. రోబోటిక్స్, సబ్ మెర్సిబుల్ సిస్టం, మార్కెటింగ్ విభాగాల్లో పేరుగాంచింది. సముద్రగర్భంలో పరిశోధనలు నిర్వహించే రిమోట్ వాహనాలు ‘ఆపరేటెడ్ వెహికల్స్ ఫర్ మెరైన్ (ఆర్‌ఓవీ)లను సంస్థ తయారు చేస్తుంది. దీనిద్వారా సముద్రంలో సర్వే, పైపులైన్ల తనిఖీలు నిర్వహించే వీలు కలుగుతుంది. సంస్థ సీఈఓ సిల్వియా కుమార్తె లిజ్ టేలర్ 1994 నుంచి సంస్థ కార్యకలాపాల బాధ్యతలు చేపట్టారు. ఇయాన్ గ్రిఫిత్ డోయర్ ఆపరేషన్లలో ప్రసిద్ధి చెందారు.
మైనర్ పోర్టుల ఆధునీకరణ, సముద్ర ఎగుమతులు, తీరప్రాంత పరిశ్రమల స్థాపన, వౌలిక సదుపాయాల కల్పనలో డోయర్ సంస్థ ఏపీతో భాగస్వామ్యానికి సుముఖత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 1095 కిలోమీటర్ల జలరవాణా ఉంటే 895 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునే వీలు కలుగుతుందని, కార్గో ఎగుమతులతో పాటు 40 ప్రధాన నదులు గోదావరి, కృష్ణా, పెన్నా జల రవాణాకు అనుకూలంగా ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి వివరించారు.
ఏపీకి తయారీ రంగ పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారీ రంగం కంపెనీల ఏర్పాటుకు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రత్యేకనిధి ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ సంస్థల రాకతో ఆర్థికాభివృద్ధి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులోభాగంగా ఆర్డర్ ఈక్విటీ పార్టనర్స్ ప్రతినిధి జంపాల రమణతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈక్విటీ భాగస్వాములు ప్రముఖ తయారీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేలా చొరవ చూపుతారు. ఇందుకోసం తమ సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్డర్ ఈక్విటీ పార్టనర్ (ఏఈపీ) ప్రతిపాదించింది. రూ. 200 కోట్ల ఉమ్మడి భాగస్వామ్య నిధి ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులోభాగంగా పోర్ట్ఫోలియో కంపెనీలు తమ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తరలించేలా చర్యలు చేపడతారు. రానున్న 18నెలల్లో ఏఈపీ, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ముందుగా రూ. 150 కోట్లు పెట్టుబడులు పెడతాయి. మరో రూ. 50కోట్ల ఉమ్మడి నిధితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారు. ఈ పైలెట్ ఫండ్ ఆధారంగా రాబోయే రోజుల్లో 15వందల నుంచి 2వేల కోట్ల రూపాయల నిధిని సమకూర్చేలా చర్యలు తీసుకుంటారు.
ఈ ఉమ్మడి భాగస్వామ్య ప్రయత్నం వల్ల రాష్ట్ర ఆర్థిక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 10 నుంచి 20వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తయారీ రంగ సంస్థలు సుమారు 20వరకు ఈ ప్రతిపాదన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల పన్నుల రూపంలో ఏటా రూ. 100 నుంచి 250 కోట్లు సమకూరతాయి. ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 200 కోట్లు ఈ జాయింట్ వెంచర్ ద్వారా సమకూరతాయని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు గ్రీన్‌ఫీల్డ్ తయారీరంగ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై విధివిధానాలను చర్చించిన ముఖ్యమంత్రి భవిష్యత్‌లో ఈ భాగస్వామ్యం మరింత ప్రయోజనకారిగా ఉండేలా చొరవ చూపాలని ఆర్డర్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ ప్రతినిధులను కోరారు.