రాష్ట్రీయం

రాష్ట్రంలో రెండ్రోజులు సంతాప దినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 24: మావోయిస్టుల దాడిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాలను అవనతం చేయాలని ఆదేశించింది. ఇద్దరి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన అనంతరం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోమవారం న్యూజెర్సీ నుంచి కిడారి సతీమణి పరమేశ్వరి, సివేరి ఇందుని ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. ఎస్టీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చిచంపటం అమానుషమని, జరిగిన నష్టాన్ని పూడ్చలేమని పరమేశ్వరిని ఆయన ఓదార్చారు. కిడారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం కృషిచేయటమే నిజమైన నివాళి అన్నారు. అనంతరం సివేరి ఇందుతో సీఎం మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సోమ చేసిన కృషిని ప్రస్తుతిస్తూ ఆయన మృతి పార్టీకి తీరనిలోటని సంతాపం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గుండెదిటవు చేసుకుని మనోస్థయిర్యంతో ఉండాలని కోరారు. సోమ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఈసందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.