ఆంధ్రప్రదేశ్‌

ఆధునీకరణ దిశగా ఐటీఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఒడిశాలోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (సీటీటీసీ)ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఆ శాఖాధికారులు సోమవారం సందర్శించారు. భువనేశ్వర్‌లోని ఆ సెంటర్‌లో అనుసరిస్తున్న శిక్షణ పద్ధతులు, సాంకేతిక వ్యవస్థ, తదితరుల అంశాలను పరిశీలించారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించేందుకు వీలుగా సీటీటీసీ సహకారం తీసుకునేందుకు నిర్ణయించి ఆ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం సెంచూరియన్ వర్సిటీని కూడా వారు సందర్శించారు. నైపుణ్యాభివృద్ధికి అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి సహా తక్షణమే ఉపాధి కల్పనకు వీలుగా తీసుకుంటున్న చర్యలు, పాటిస్తున్న జాగ్రత్తల గురించి అక్కడి అధికారులతో చర్చించారు. ఐటీఐలను స్వయం సమృద్ధి చేసేందుకు అక్కడ అమలుచేస్తున్న విధానాల గురించి ఆరాతీశారు. సీటీటీసీ శిక్షణతో పాటు ఆదాయం పెంపొందించుకునే అంశంపై దృష్టి సారించింది. శిక్షణ సమయంలోనే మార్కెట్‌లో ఉపయోగించే పరికరాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోని ఐటీఐల్లో ఈ విధానాలు అమలు చేసేందుకు మంత్రి నిర్ణయించారు. అవసరమైతే సీటీటీసీని కన్సల్టెంట్‌గా సేవలు వినియోగించుకుంటామని పితాని వివరించారు.

చిత్రం..అధికారులతో కలిసి ఒడిశాలోని సీటీటీసీని పరిశీలిస్తున్న మంత్రి పితాని