ఆంధ్రప్రదేశ్‌

నేటితో రొట్టెల పండుగ ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 24: నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ నేటితో ముగియనుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పండుగకు భక్తుల అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పటివరకూ సుమారు 10లక్షల పైబడి భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. 2014లో ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పట్నుంచి ఇక్కడ సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో భక్తుల తాకిడి ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. గతేడాది పది లక్షల మంది వరకు భక్తులు ఈ పండుగకు విచ్చేయగా ఈ ఏడాది ఇప్పటికే భక్తుల సంఖ్య పది లక్షలను దాటిందని అధికారులు తెలిపారు.
చివరిరోజైన మంగళవారం భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశముంది. చివరి రోజు సుమారు 4 నుండి 5లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతో అధికారులు, దర్గా కమిటీ నిర్వాహకులు సిద్ధమయ్యారు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నీ తానై గత నాలుగు రోజులుగా దర్గా పరిసరాల వద్దనే తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పండుగ ప్రారంభమైనప్పటి నుండి ఆయన నెల్లూరు నగరానికే పరిమితమై పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను తరచూ పర్యవేక్షిస్తూ, దర్గా పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ తగు సూచనలు ఇస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుండి రొట్టెల పండుగకు వస్తున్న భక్తులు కూడా ఇక్కడి ఏర్పాట్లను చూసి అభినందిస్తుండడం విశేషం. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు రొట్టెల పండుగకు హాజరై రొట్టెలను స్వీకరించి దర్గాను దర్శించుకున్నారు.
రాష్ట్భ్రావృద్ధి రొట్టె పట్టుకున్న స్పీకర్
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు సోమవారం రొట్టెల పండుగకు విచ్చేశారు. రాష్ట్భ్రావృద్ధిని కాంక్షిస్తూ ఆయన రొట్టెను స్వీకరించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఇక్కడ వౌలిక సదుపాయాల కల్పనతో పాటు పండుగకు మరింత ప్రాచుర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, ఫలితంగా భక్తుల సంఖ్య లక్షల సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలిపారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ప్రాంగణం మొత్తాన్ని జల్లెడ పడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గత నాలుగు రోజుల నుండి నగరంలోనే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి నారాయణను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతక్రితం దర్గాలోని అమర వీరుల సమాధులను దర్శించుకున్న స్పీకర్ అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..రొట్టెల పండగలో రాష్ట్ర అభివృద్ధి రొట్టె పట్టుకున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రి నారాయణ, నగర మేయర్ అజీజ్ తదితరులు