ఆంధ్రప్రదేశ్‌

కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 10: పుష్కర పనుల్లో భాగంగా విజయవాడలో కూల్చివేస్తున్న దేవాలయాలను తక్షణమే ఆగమ శాస్తబ్రద్ధంగా పునర్నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ ఉత్తర విభాగం (ఆంధ్రప్రదేశ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరావు ఆదివారం విశాఖలో విలేఖర్లతో మాట్లాడారు. పుష్కరాల ప్రారంభంలోగా దేవాలయాలను యథావిధిగా నిర్మించాలన్నారు. ఒకప్పుడు ముస్లిం పాలకులు హిందూ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని నాశనం చేశారని, నేటి పాలకులు వారి చేష్టలను మరిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కలెక్టర్, విజయవాడ కమిషనర్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో చారిత్రాత్మకత కలిగిన దేవాలయాలను అర్ధరాత్రి వేళ కూల్చివేతకు పాల్పడిన అధికారులు, వారికి వత్తాసు పలికిన ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు హైందవ సంస్కృతిని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పుష్కర పనుల్లో ఒక్క మసీదు, చర్చిని వీళ్లు కూలగొట్టే ధైర్యం చేయగలరా? అని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్ల కోసం హిందుత్వంపై దాడులకు తెగబడుతున్న పాలకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆలయాలన్నీ కూల్చివేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలు పెడతారా అని ఎద్దేవా చేశారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా సాధుపరిషత్, హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న ఉద్యమానికి విశ్వహిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.
విహెచ్‌పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందర్ప వాసు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఏకపక్షంగా దేవాలయాల కూల్చివేతకు పాల్పడటం దారుణమని విమర్శించారు. విజయవాడలో గోశాల కూల్చివేతపై అడిగేందుకు వెళ్లిన సాధుపరిషత్ ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించిన ఎంపి నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.