కృష్ణ

నయనానందకరంగా శ్రీ సిద్ధేంద్ర నాట్య మహోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: నృత్య గానాలతో శ్రీ సిద్ధేంద్ర నాట్య మహోత్సవాలు నయనానందకరంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా విశ్వవిద్యాలయం, జావళీల సృష్టికర్త దాసు శ్రీరాములు దహోత్రి, యువ భారతి స్వరలహరి నిర్వాహకురాలు శాంతదాసు ఆర్థిక సహకారంతో నాట్యక్షేత్రం కూచిపూడిలో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ సిద్ధేంద్ర నాట్య మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై యువత ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను తన్మయపర్చాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మధునాపంతుల సీతాప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన పసుమర్తి మృత్యుంజయశర్మ ఆదిశంకరాచార్య విరచిత వినాయక వందనం అనే ప్రార్థనా గీతాన్ని రాఘమాలిక రాగం ఆదితాళంలో, పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ విరచిత రఘువంశ సుధాంబుది చంద్ర.. అనే పరసురామ గర్వభంగం అనే అంశాన్ని కథన కుతూహలరాగం ఆదితాళంలో, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, స్వాతి తిరునాళ్ మహరాజు విరచిత, స్వరపర్చిన థిల్లానాను శ్రీ అనంత పద్మనాభ స్వామివారి మహత్మ్యాన్ని ప్రదర్శించారు.
కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏలేశ్వరపు రాధిక, తేజస్వీ, రాజేశ్వరి, డివి ఆచార్య రచించిన బ్రహ్మాంజలి అనే పూజా నృత్యాన్ని రాగమాలికరాగం ఆదితాళంలో, జతికట్టును మధ్యమావతి రాగం ఆదితాళంలో, సీతాప్రవేశాన్ని ఖమాస్‌రాగం ఆదితాళంలో రాజేశ్వరి ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. చివరిగా నర్సాపురానికి చెందిన డికె విజయలక్ష్మి సదాశివ బ్రహ్మేంద్ర రచించిన మానస సంచరరే అంటూ శ్రీకృష్ణుని మోహన రూపాన్ని రాగమాలిక రాగం ఆదితాళంలో, నల్లని మేను నగుమోముల చూపులవాడ అనే అన్నమాచార్య కీర్తనను పూరి కల్యాణ రాగం ఆదితాళంలో, మరకత మణిచేల.. అంటూ నారాయణ తీర్థుల తరంగాన్ని ఇత్తడి పళ్లెంపై తలమీద నీళ్ల చెంబుతో నర్తించిన తీరు ప్రేక్షకుల్ని నిశే్చష్ఠుల్ని చేసింది. పసుమర్తి కేశవప్రసాద్ నట్టవాంగం, పాణ్యం దక్షణామూర్తి వయోలిన్, పూల సత్యనారాయణ మృందగం, దాలిపర్తి మెహర్ వీణ, పసుమర్తి హరినాథశాస్ర్తీ ఎఫ్ట్‌ల ద్వారా నృత్య ప్రదర్శనలను రక్తికట్టించారు. కళాకారులు, నాట్యాచార్యులను కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ అతిథుల ద్వారా దుశ్శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఇఇ మృతి
జగ్గయ్యపేట రూరల్, మార్చి 20: విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఇఇ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సేకరించిన సమాచారం ప్రకారం పులిచింతల ప్రాజెక్టు రిటైర్డ్ ఇఇ పిల్లి భాస్కరరావు (60) హైదరాబాదు నుండి ఒక్కరే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కృష్ణా ఇన్ హోటల్ సమీపంలో కారుకు అడ్డంగా గేదె రావడంతో తప్పించే క్రమంలో కారు వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. సంఘటనా స్థలంలోనే భాస్కరరావు మృతి చెందారు. ఈయన విజయవాడ వెళుతున్నట్లు తెలిసింది. మృతుడి భార్య గత ఏడాదే పోయారు. ఇద్దరు సంతానం ఉన్నట్లు వారు అమెరికాలో ఉన్నట్లు చిల్లకల్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ వంశీకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు దివాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.