ఆంధ్రప్రదేశ్‌

తీర ప్రాంత పరిరక్షణకు వ్యూహాత్మక అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: భారత, జపాన్ తీర ప్రాంతాల రక్షణకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు తూర్పు నౌకాదళ కమాండింగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, జపాన్ మెరిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ టుసూయా ఫుకాడ తెలియచేశారు. విశాఖ నేవల్‌డాక్‌యార్డులోని భారత నౌకాదళ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సహ్యాద్రిపై సోమవారం వీరు సంయుక్త విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండర్ టసూయా మాట్లాడుతూ తమ దేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నామని అన్నారు. జపాన్ నౌకాదళం ఇప్పటి వరకూ ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్ దేశాలతో సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో పాల్గొందని తెలియచేశారు. ఐదేళ్ల తరువాత భారత్‌తో సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటున్నామని టుసూయా తెలియచేశారు. దీనివలన ఇరు దేశాల మధ్య సత్‌సంబంధాలు మరింత బలోపేతంకానున్నాయని ఆయన చెప్పారు. ఇండో-పసిపిక్ తీర ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేందు ఇరు దేశాల నౌకాదళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలియచేశారు. ఇరు దేశాల ప్రభుత్వాలు కూడా రక్షణ శాఖలకు అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఇప్పటి వరకూ జపాన్ యుద్ధ రంగానికి కావల్సిన సాంకేతికతను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. గత ఐదు సంవత్సరాలుగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌలకు, విమానాలు నిర్మిస్తున్నామని టుసూయా తెలియచేశారు. తాము తయారు చేసిన యాంఫీబియస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను త్వరలోనే విదేశాలకు ఎగుమతి చేయనున్నామని ఆయన తెలియచేశారు.
ఈ విన్యాసాల్లో జపనీస్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు నౌకలు కగ, జూమో క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నజుమా పాల్గొంటున్నాయని ఆయన తెలియచేశారు. సుమారు 600 మంది జపాన్ నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో భాగస్వాములవుతున్నారని అన్నారు. అలాగే 40 మంది మహిళా నౌకాదళ సిబ్బంది కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
రియర్ అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ ప్రస్తుతం జపాన్‌తో మూడోసారి సంయుక్త విన్యాసాలను నిర్వహిస్తున్నామని తెలియచేశారు. తీర ప్రాంత రక్షణ, భద్రతకు ఇరు దేశాలు ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలియచేశారు. 21వ శతాబ్దంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, సవాళ్లను అధిగమిస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు. చాలా కాలం తరువాత భారత ప్రధాని జపాన్‌లో పర్యటించారని, దీనివలన ఇరుదేశాల మధ్య స్నేహ బంధం మరింత బలోపేతం కాబోతోందని ఆయన తెలియచేశారు. ఇరు దేశాల ప్రధానులు, ఇరు దేశాల రక్షణ మంత్రులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి, సంయుక్త ప్రణాళికలపై చర్చించారని త్రిపాఠి తెలియచేశారు. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం స్వదేశం పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ సాత్పుర, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కద్మత్ పాల్గొంటున్నాయి. వీటితోపాటు ఒక జలాంతర్గామి, లాంగ్ రేంజ్ మెరిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ8ఐ, పలు హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
భారత్, జపాన్ దేశాల నౌకాదళ ప్రతినిధులు త్రిపాఠి, టుసూయా